Thursday, May 21, 11:55
34.2 C
Hyderabad

Telangana : మందుబాబులకు బిగ్ షాక్ : పెరగనున్న మద్యం, బీర్ల ధరలు.. ముహుర్తం ఫిక్స్

Big Shock To Liquor Drinkers
Big Shock To Liquor Drinkers

తెలంగాణలోని మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ గట్టి షాకే ఇవ్వబోతోంది. రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు ముగిసిపోవడంతో, ధరల పెంపునకు ముహుర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా సమాచారం. జూన్ 2వ తేదీ తర్వాత ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలోనెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయి. దీనివల్ల లిక్కర్ సీసాల తయారీకి అత్యంత అవసరమైన ఎల్పీజీ సహజ వాయువు కొరత ఏర్పడింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరగడంతో తాము నష్టపోతున్నామని, ధరలను సవరించాలని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గత ఏడాది కాలంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల వ్యయం రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపింది.

తీవ్ర వ్యతిరేకత రాకుండా

ప్రభుత్వం నియమించిన త్రిసభ్య ధరల నిర్ధారణ కమిటీ ఇప్పటికే దీనిపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా, అలాగని కంపెనీలకు నష్టం రాకుండా శ్లాబ్ సిస్టమ్ ద్వారా ధరలను 10% నుండి 30% వరకు పెంచాలని ప్రతిపాదించారు.
సాధారణ బ్రాండ్లు ఫుల్ బాటిల్‌పై రూ. 60 వరకు, ప్రీమియం బ్రాండ్లు రూ. 100 వరకు,  హై-ఎండ్ బ్రాండ్లు రూ. 120 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే ఎండల తీవ్రత, ఐపీఎల్ సీజన్ వల్ల రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్ల ధరలు కూడా 12% నుండి 15% వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ ధరల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు నెలకు కనీసంగా రూ. 150 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరవచ్చని ఎక్సైజ్ శాఖ