
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ పుజల్ సెంట్రల్ జైలులో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలకు సరైన సౌకర్యాలు ఉన్నాయా, వైద్యం ఎలా అందుతోంది, భోజనం బాగుందా, వారికి పనులు నేర్పిస్తున్నారా అనే విషయాలను స్వయంగా పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు కూడా తెలుసుకున్నారు.
పుజల్ సెంట్రల్ జైలు దేశంలోనే పెద్ద జైళ్లలో ఒకటి. సీఎం ముందుగా పుజల్ సెంట్రల్ జైలు-1లోని క్వారంటైన్ ప్రాంతం, సందర్శకులు కలిసే హాల్, జైలు ఆస్పత్రిని పరిశీలించారు. అలాగే మత్తు పదార్థాల అలవాటు నుంచి బయటపడేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కూడా చూశారు.
Also Read : ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత
అక్కడి తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా సీఎం పరిశీలించారు. హై సెక్యూరిటీ బ్లాక్‌తో పాటు ఉరి వేసే ప్రాంతాన్ని కూడా చూశారు. ఆ తర్వాత జైలులో ఖైదీలకు పనులు నేర్పించే వర్క్‌షాప్‌లకు వెళ్లారు. అక్కడ ఖైదీలు ఇనుప కూరగాయల స్టాండ్లు, పేపర్ కవర్లు, ఆఫీస్ ఫైళ్లు పెట్టుకునే ఫోల్డర్లు తయారు చేస్తున్నారు. వాటిని సీఎం పరిశీలించారు.
అలాగే పవర్లూమ్ విభాగానికి వెళ్లి అక్కడ దుప్పట్లు, ఇతర వస్త్రాలను ఎలా తయారు చేస్తున్నారో చూశారు. టైలరింగ్ యూనిట్‌ను కూడా పరిశీలించారు. ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని సీఎం స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖైదీలతో మాట్లాడి.. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏం కావాలి అని నేరుగా అడిగి తెలుసుకున్నారు.
జైలు తనిఖీ పూర్తయిన తర్వాత సీఎం పుజల్లోని ఎం-3 పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసుల రోజువారీ పనుల గురించి ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని రిజిస్టర్లను పరిశీలించారు. సబ్-ఇన్స్పెక్టర్ గది, కంప్యూటర్ గది, ఖైదీలను ఉంచే లాక్అప్ను కూడా తనిఖీ చేశారు.
Also Read : తినేది ఇండియా తిండి.. పాడేది పాకిస్థాన్ పాట.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్!









