
P Muralidhar Rao : ఇటీవల మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ విషయం రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. కాగా, కొండా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు స్పందించారు. ఎవరిని పడితే వారిని చేర్చుకోవడానికి బీజేపీ చెత్తబుట్ట (డస్ట్‌బిన్) కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం బయటపడుతున్న ప్రతిసారీ, ఊహాజనిత రాజకీయ కథనాల్లోకి బీజేపీని లాగడానికి మీడియా ఎందుకు ఇంత ఆత్రుత చూపుతోంది? అంటూ మురళీధర్ రావు మండిపడ్డారు.
జరుగుతున్న పరిణామాలను అర్ధాంతరంగా ఆపేసి, ప్రజల దృష్టిని మళ్లించి, కాంగ్రెస్ తన సమస్యలను మొగ్గలోనే తుంచేసుకోవడానికి సాయపడే ప్రయత్నమా? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ, పార్టీకి కట్టుబడిన కార్యకర్తలు కేవలం అసంతృప్త నేతలను చేర్చుకునే ఒక డంపింగ్ గ్రౌండ్‌గా మారాలని అనుకోవట్లేదంటై హాట్ కామెంట్స్ చేశారు. సంస్కృతి, నైతికత, రాజకీయ విధానాల పరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికీ ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు.
Also Read : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. క్యాబినెట్ నుంచి బర్త్‌రఫ్!
రాష్ర్టంలో బీజేపీ ఒక నిజమైన ప్రత్యామ్నాయం. కేవలం మరో పేరు మార్పు కాదు. ఖచ్చితంగా కాదు… బీజేపీ ఎప్పటికీ డస్ట్‌బిన్ అవ్వదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బయటకు కనిపించే ఈ ఊహాగానాల వెనుక కుట్రలు ఉండవచ్చన్నారు. కాగా, ఈ ప్రకటన ద్వారా పార్టీ అంతర్గత విషయాలపై,ఇతర పార్టీల నుంచి వచ్చే వలసల గురించిన ఊహాగానాలకు మురళీధర్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కాగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విబేధాల నేపథ్యంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖను బర్త్‌రఫ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, దీంతో కొండా దంపతులు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. నిజానికి కొండా సురేఖ దంపతులు ఇప్పటి వరకు పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటనచేయలేదు. అయినప్పటికీ గతంలో వారు బీఆర్ఎస్ ను విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఇప్పుడు బీజేపీలోకే వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మురళీధర్ రావు కామెంట్స్ హాట్ గా మారాయి.
Also Read : కాకతీయుల కళకు అరుదైన గౌరవం.. పాలంపేట గొల్లల గుడికి కేంద్రం అధికారిక గుర్తింపు









