
– RAVI PRAKASH
Eiffel Tower మహిళలు లేని ఐఫుల్ టవర్‌ను మీరు ఊహించగలరా? టూరిస్టులుగా కాదు… విజిటర్లుగా కాదు… అక్కడే పని చేసే మహిళలను తమ వర్క్‌స్టేషన్స్ నుంచి పక్కకు వెళ్లమని చెబితే..కనిపించకుండా ఇన్‌విజిబుల్‌గా ఉండాలని చెబితే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నాం కదా.. కానీ…పారిస్‌లో ఇప్పుడు ఇదే ఒక మేజర్ కాంట్రోవర్సీకి కారణమైంది. శనివారం… హిందూ సంస్థ బిఎపిఎస్ కి సంబంధించిన ఒక డెలిగేషన్ ఐఫుల్ టవర్ ను సందర్శించింది. అయితే…ఐఫుల్ టవర్ సిబ్బంది, అలాగే టవర్‌ను నిర్వహించే ఆపరేటింగ్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం…ఆ డెలిగేషన్ విజిట్ టైమ్‌లో.. మహిళా ఉద్యోగులను వారి వర్క్‌స్టేషన్స్ నుంచి పక్కకు వెళ్లమని ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో… వారు ఎవరికీ కనిపించకుండా ఉండాలని కూడా చెప్పినట్లు సమాచారం. అంటే…అక్కడ పని చేసే మహిళలు, ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యం కావాలని చెప్పారు. ఈ వ్యవహారంపై ఐఫుల్ టవర్ మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. ఆ డెలిగేషన్… అక్కడున్న లేడీస్‌తో ఇంటరాక్షన్స్ లేకుండా అరేంజ్‌మెంట్స్ చేయాలని కోరినట్లు మేనేజ్‌మెంట్ అంగీకరించింది. అంతేకాదు… ఇలాంటి కండిషన్స్‌కు ఒప్పుకోవడం పొరపాటని కూడా మేనేజ్‌మెంట్ ఒప్పుకుంది. ఇక్కడితో కాంట్రోవర్సీ ఆగలేదు. దీని తర్వాత జరిగినది మరింత ఎక్స్‌ట్రార్డినరీ డెవలప్‌మెంట్! సోమవారం.. ఐఫుల్ టవర్ ఉద్యోగులు నిరసనకు దిగారు. మేనేజ్‌మెంట్ ఐఫుల్ టవర్‌ను క్లోజ్ చేసింది. అసలేం జరిగింది? అన్నదానిపై పారిస్ అధికారులు ఇన్‌వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
Also Read : ఉబెర్ కీలక నిర్ణయం..ఇక వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బ్రేక్ ?
దీంతో, ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన సింబల్స్‌లో ఒకటైన ఐఫుల్ టవర్ …ఒక్కసారిగా ఒక పెద్ద డిబేట్‌కు కేంద్రంగా మారింది. వుమెన్… రిలీజియన్… ఈక్వాలిటీ… అండ్ ఎకామడేషన్‌కు ఉన్న లిమిట్స్… ఈ నాలుగు అంశాల చుట్టూ ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది. ఈ కథకు మరో సైడ్ కూడా ఉంది. బిఎపిఎస్ చెబుతున్న దేమిటంటే… తమ డెలిగేషన్ పెద్ద సంఖ్యలో ఉండటంతో… ఇతర విజిటర్స్‌కు ఇబ్బంది కలగకుండా, ఓపెనింగ్ అవర్స్ ప్రారంభంలోనే ఈ విజిట్‌ను ఏర్పాటు చేశామని చెబుతోంది. అంతేకాదు… తమకు తెలిసినంతవరకు… ఎవరినీ ఐఫుల్ టవర్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోలేదని బిఎపిఎస్ చెబుతోంది. ఈ ఘటన వల్ల ఎవరికైనా పెయిన్ లేదా ఇన్‌కన్వీనియన్స్ కలిగినట్లయితే బిఎపిఎస్ క్షమాపణలు కూడా చెప్పింది.
అయితే… అసలు ఐఫుల్ టవర్ లోపల ఏం జరిగింది? మహిళలను పక్కకు వెళ్లమని, దాక్కోమని ఎవరు చెప్పారు? దానికి ఎవరు అంగీకరించారు? అంతేకాకుండా, ఒక విజిటింగ్ గ్రూప్‌కు ఉన్న రిలీజియస్ బిలీఫ్స్… ఒక పబ్లిక్ వర్క్‌ప్లేస్‌లో పనిచేసే మహిళలను… ఇన్‌విజిబుల్‌గా మార్చడానికి ఎప్పుడైనా జస్టిఫికేషన్ అవుతాయా? ఇదే ఇప్పుడు అసలు కాంట్రోవర్సీ! ఇదే అసలు ప్రశ్న! అస్సలు ఆ రోజు ఐఫుల్ టవర్‌లో ఏం జరిగింది? ఎవరు ఏం కోరారు? ఎవరు దానికి ఓకే చెప్పారు? మహిళల సమానత్వం ఎక్కడ నిలబడింది? ఇవన్నీ.. మనం ఎగ్జామిన్ చేయాల్సిందే! ఐఫుల్ టవర్ పార్ట్ 2 ఇప్పుడు! మనం కన్క్లూజన్స్‌కి వెళ్లే ముందు… అసలు బిఎపిఎస్ ఎవరు? ఈ పర్టికులర్ విజిట్… ఇంత పెద్ద కాంట్రోవర్సీగా ఎందుకు మారింది? అనేది అర్థం చేసుకుందాం.
బిఎపిఎస్ అంటే… బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా… టెంపుల్స్, ఫాలోవర్స్‌తో ఉన్న ఒక మేజర్ హిందూ ఆర్గనైజేషన్. బిఎపిఎస్ ప్రతినిధులు… పారిస్ సమీపంలో కొత్తగా నిర్మించిన బిఎపిఎస్ హిందూ టెంపుల్ ఇనాగ్యురేషన్ కోసం ఫ్రాన్స్‌కు వచ్చారు.ఆ సెలబ్రేషన్స్‌లో భాగంగా… శనివారం… సుమారు 100 మందికి పైగా ఉన్న ప్రతినిధి బృందం.. ఐఫుల్ టవర్‌ను ప్రైవేట్‌గా విజిట్ చేసింది. ఈ స్టోరీలో ఇప్పుడు అసలైన క్రూషియల్ పార్ట్ చూద్దాం.
ఐఫుల్ టవర్ స్టాఫ్ యూనియన్ చెబుతున్న వివరాల ప్రకారం… ఆ డెలిగేషన్ అక్కడికి చేరుకున్నప్పుడు… ఫిమేల్ ఎంప్లాయీస్‌ను తమ వర్క్‌స్టేషన్స్ నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఎందుకు? మెయిల్ ఎంప్లాయీస్ వాళ్ల స్థానాల్లోకి రావడానికి! అంతేకాదు… డెలిగేషన్ కొన్ని ఏరియాస్ నుంచి వెళ్తున్న సమయంలో… కొంతమంది మహిళా ఉద్యోగులను పక్కకు వెళ్లమని కోరినట్లు స్టాఫ్ చెబుతోంది. కానీ… అలెగేషన్ ఇక్కడితో ఆగలేదు! ఎంప్లాయీస్ చెప్పిన ప్రకారం… మహిళలకు ఎఫెక్టివ్‌గా… మేక్ యువర్ సెల్వ్స్ ఇన్‌విజిబుల్ అంటే… కనిపించకుండా దాక్కోండి అన్నట్టుగా సూచనలు ఇచ్చారని ఆరోపణ. ఇదే ఈ కథను… మరింత సీరియస్‌గా మార్చింది! అయితే… ఈ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే… ఇది కేవలం… సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అలెగేషన్ మాత్రమే కాదు! ఐఫుల్ టవర్‌ను ఆపరేట్ చేసే కంపెనీ… ఎస్‌ఈటిఈ… బిఎపిఎస్ ప్రతినిధి బృందం.. మహిళలతో ఇంటరాక్షన్స్‌ను పరిమితం చేసేలా అరేంజ్‌మెంట్స్ చేయాలని కోరిందని ఎక్నాలెడ్జ్ చేసింది.
Also Read : శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఉద్యోగులపై వేటు!
అంతేకాదు… ఆ కండిషన్స్‌ను అంగీకరించి తప్పు చేశామని ఎస్‌ఈటిఈ ఒప్పుకుంది. అండ్ ద్యాట్ అడ్మిషన్ చేంజెస్ ది స్టోరీ! ఐఫుల్ టవర్ మేనేజ్‌మెంట్ మహిళల్ని కనపడకుండా చేయడానికి ఎందుకు అంగీకరించింది? ఈ నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది.
ఒక విజిటింగ్ డెలిగేషన్‌కు ఉన్న రిలీజియస్ ప్రిఫరెన్సెస్ కారణంగా… ఫిమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ కండిషన్స్‌ను ఎందుకు మార్చాలి? వాళ్లు పనిచేస్తున్న వర్క్‌ప్లేస్‌లో… వారి వర్క్స్ టైమింగ్స్ ఎందుకు మార్చాలి? అసలు మహిళలను ఎందుకు టార్గెట్ చేయాలి? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్! ఇప్పుడు ఈ మేటర్ అన్‌ఎక్సెప్టబుల్‌గా అనిపిస్తే… అసలు మొదట్లో దాన్ని ఎక్సెప్ట్ ఎందుకు చేశారు? ఇదే మరో బిగ్ క్వశ్చన్! ఆ తర్వాత ఇష్యూ పెద్దదైంది.ఎంప్లాయీస్ రియాక్షన్ వచ్చింది! వాళ్లు… ప్రొటెస్ట్ చేశారు! ఆన్సర్స్ డిమాండ్ చేశారు! అంతేకాదు.. సోమవారం… ఈ ఇన్సిడెంట్‌పై స్టాఫ్ మీటింగ్ పెట్టిన టైమ్‌లో ఐఫుల్ టవర్ క్లోజ్ చేశారు.
ఇప్పుడు… పారిస్ అథారిటీస్ కూడా ఈ ఘటనపై ఇన్‌వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి! ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్‌గా చెప్పాలి. దిస్ స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ అటాకింగ్ హిందూయిజమ్. ఈ స్టోరీ హిందూ మతంపై దాడికి సంబంధించినది కాదు. ఇది… ఎవరైనా వ్యక్తి ఫెయిత్‌ను అటాక్ చేయడం కూడా కాదు. ఒక రిలీజియస్ గ్రూప్‌కు తమ బిలీఫ్స్‌ను ఫాలో అయ్యే హక్కు ఉందా లేదా అన్నది కూడా కాదు.
ఆ హక్కు వారికి ఉంది. కానీ… రియల్ క్వశ్చన్ చాలా సింపుల్! మీ రిలీజియస్ ప్రాక్టీస్ … మరొకరి వర్క్‌ప్లేస్ లోకి వచ్చినప్పుడు… హూ హాస్ టు అడ్జస్ట్? ఎవరు అడ్జస్ట్ కావాలి? ఆ అడ్జస్ట్‌మెంట్ అంటే.. ఒక మహిళను పక్కకు తప్పుకోండి.. వి డోంట్ వాంట్ యూ టు బి సీన్. అంటే మీరు కనిపించడం మాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చా…? ఇక్కడే ఈ కథ మెయిన్ టర్న్ తీసుకుంటుంది! ఇది కేవలం… ఐఫుల్ టవర్ గురించి కాదు. ఇది… అంతకంటే చాలా బిగ్గర్ ఇష్యూ! ఇది… ఈక్వాలిటీ గురించి! మహిళల సమానత్వం గురించి… ఒక పబ్లిక్ వర్క్‌ప్లేస్‌లో… రిలీజియస్ ఎకామడేషన్‌కు లిమిట్స్ ఎక్కడ? ఈక్వాలిటీ ఎక్కడ మొదలవుతుంది? అనే అసలు ప్రశ్న గురించి! ద్యాట్ ఈజ్ వేర్ దిస్ స్టోరీ బికమ్స్ మచ్ బిగ్గర్ దాన్ ది ఐఫుల్ టవర్. అండ్ ద్యాట్స్ వేర్ వి నీడ్ టు టాక్ అబౌట్ ఈక్వాలిటీ. అక్కడే ఈ స్టోరీ ఐఫుల్ టవర్ కంటే చాలా పెద్దదిగా మారుతుంది. అక్కడే మనం సమానత్వం గురించి మాట్లాడుకోవాలి.
హూ ఈజ్ బిఎపిఎస్? అసలు.. ఈ కాంట్రోవర్సీ మధ్యలో ఉన్న ఆ ఆర్గనైజేషన్ ఎవరు? బిఎపిఎస్. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ. అసలు… హూ ఈజ్ బిఎపిఎస్? ఈ సంస్థ ఎలాంటిది? ఎంత పెద్ద ఆర్గనైజేషన్? ముందు దీని గురించి తెలుసుకుందాం. బిఎపిఎస్… స్వామినారాయణ్ ట్రెడిషన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన హిందూ ఆర్గనైజేషన్స్‌లో ఒకటి. దీని రూట్స్… 19వ సెంచరీ ప్రారంభంలో… భగవాన్ స్వామినారాయణ్ స్థాపించిన స్వామినారాయణ్ ట్రెడిషన్‌లో ఉన్నాయి. అయితే బిఎపిఎస్ ఇట్సెల్ఫ్… 1907లో శాస్త్రీజీ మహరాజ్ స్థాపించారు.
ఆ తర్వాత… కొన్ని దశాబ్దాలుగా… ఈ సంస్థ ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్‌గా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా… టెంపుల్స్… సెంటర్స్… ఫాలోవర్స్… ఇలా భారీ స్థాయిలో విస్తరించింది. ఇక… సెప్టెంబర్ 6, 2026! పారిస్‌కు సమీపంలోని… బస్సీ సాంట్ జార్ష్ లో బిఎపిఎస్ తన కొత్త గ్రాండ్ స్వామినారాయణ్ హిందూ మందిర్‌ను ఇనాగ్యురేట్ చేసింది.
ఇది మామూలు టెంపుల్ కాదు! ఫ్రాన్స్‌లో ఈ స్థాయిలో నిర్మించిన తొలి ట్రెడిషనల్ హిందూ టెంపుల్. అంతేకాదు… కాంటినెంటల్ యూరప్‌లో సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద హిందూ టెంపుల్స్‌లో ఒకటి! మరి… ఈ ఇనాగ్యురేషన్‌ను ఎవరు అడ్రస్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీయే చేశారు. అయితే… ఫిజికల్లీ కాదు. వీడియో స్పీచ్ ద్వారా చేశారు.
అయితే ఆయన మెసేజ్ మాత్రం… స్పష్టమైన ఆత్మీయతతో చెప్పినట్లుగా ఉంది. అంతేకాకుండా ప్రధాని మోదీ… బిఎపిఎస్‌కు, దాని స్పిరిచువల్ లీడర్ మహంత్ స్వామి మహరాజ్‌కు కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఈ కొత్త టెంపుల్‌ను… ఇండియా-ఫ్రాన్స్ కల్చరల్ రిలేషన్స్‌లో ఒక న్యూ చాప్టర్‌గా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా… ఇండియన్ కల్చర్, ఇండియన్ స్పిరిచువాలిటీను స్ప్రెడ్ చేయడంలో బిఎపిఎస్ చేస్తున్న కాంట్రిబ్యూషన్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు… ఈ కొత్త టెంపుల్‌ను… 2024లో అబుదాబిలో ఇనాగ్యురేట్ చేసిన బిఎపిఎస్ టెంపుల్‌తో కూడా కనెక్ట్ చేశారు. అంటే… ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. బిఎపిఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఆర్గనైజేషన్. ఇది చిన్న సంస్థ కాదు. మరో విషయం కూడా అంతే క్లియర్‌గా ఉంది.
ప్రైమ్ మినిస్టర్ మోదీకి బిఎపిఎస్ లీడర్‌షిప్‌తో లాంగ్‌స్టాండింగ్ అసోసియేషన్ ఉంది. మోదీ… దివంగత ప్రముఖ స్వామి మహరాజ్‌పై తనకు ఉన్న డీప్ పర్సనల్ రెస్పెక్ట్ గురించి అంటే గాఢమైన వ్యక్తిగత గౌరవాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారు. మోదీ అనేకసార్లు… మేజర్ బిఎపిఎస్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. మరి ఇప్పుడు… ఈ ఐఫుల్ టవర్ కాంట్రోవర్సీ ఫ్రాన్స్‌లో నేషనల్ టాకింగ్ పాయింట్‌గా మారడానికి కేవలం ఒక్కరోజు ముందు… ఇండియా ప్రైమ్ మినిస్టర్… పారిస్ సమీపంలోని బిఎపిఎస్ టెంపుల్ ఇనాగ్యురేషన్‌ను అడ్రస్ చేశారు.
కానీ… ఇక్కడ ఒక విషయం మాత్రం అబ్సల్యూట్లీ క్లియర్‌గా చెప్పాలి! నన్ ఆఫ్ దిస్ ఈజ్ ది కాంట్రోవర్సీ. అసలు ఇది వివాదమే కాదు. ఒక హిందూ ఆర్గనైజేషన్‌కు. .. టెంపుల్స్ నిర్మించే పూర్తి హక్కు ఉంది. ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్‌కు… తమ బిలీఫ్స్‌ను ఫాలో అయ్యే పూర్తి హక్కు ఉంది.
ఒక ప్రైమ్ మినిస్టర్‌కు… రిలీజియస్ లేదా కల్చరల్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసే పూర్తి హక్కు ఉంది. ద్యాట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్. అది అసలు ప్రశ్నే కాదు! ది రియల్ క్వశ్చన్ ఈజ్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. ఆ రిలీజియస్ డెలిగేషన్… టెంపుల్ సెలబ్రేషన్స్ నుంచి బయటకు వచ్చి… ఐఫుల్ టవర్‌కు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అన్నది మాత్రమే ఇక్కడ కీ పాయింట్.
ఎందుకంటే… ఐఫుల్ టవర్ ఒక టెంపుల్ కాదు! అది… రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ కాదు! అక్కడ పనిచేసే వాళ్లు… డివోటీస్ కాదు! వాళ్లు… జస్ట్ ఎంప్లాయీస్ మాత్రమే! కాబట్టి… ఒక ప్రతినిధి బృందం మహిళలతో ఇంటరాక్షన్ కోరుకోవడం లేదనే కారణంతో… మహిళా ఉద్యోగులను నిజంగానే పక్కకు వెళ్లమంటే.. మనమొక చాలా బేసిక్ క్వశ్చన్ అడగాల్సిందే! వేర్ డస్ రిలీజియస్ ఫ్రీడమ్ ఎండ్ అండ్ సమ్‌వన్స్ ఎల్స్ రైట్స్ బిగిన్? మత స్వేచ్ఛకు పరిమితి ఎక్కడి వరకు ఉంది?
సేమ్ టైమ్ ఇంకొకరి హక్కులు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు.? మీరు మీ ఫెయిత్‌ను ఫాలో కావచ్చు. మీ రిలీజియస్ డిసిప్లిన్‌ను ఫాలో కావచ్చు. బట్… ఆ డిసిప్లిన్… ఒక మహిళ… తన స్వంత వర్క్‌ప్లేస్‌లో నిలబడాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించగలదా? క్యాన్ ఇట్? ఇదే ఇప్పుడు… ఫ్రాన్స్ ఈజ్ ఆస్కింగ్! అయితే… ఈ మొత్తం స్టోరీలో… బహుశా మోస్ట్ ఎక్స్‌ట్రార్డినరీ పార్ట్ ఇదే! ఐఫుల్ టవర్ మేనేజ్‌మెంట్ స్వయంగా… మహిళలతో ఇంటరాక్షన్‌ను లిమిట్ చేయడానికి అరేంజ్‌మెంట్స్ చేసినట్లు ఎక్నాలెడ్జ్ చేసింది.
అంతేకాదు… సచ్ కండిషన్స్ షుడ్ నెవర్ హావ్ బీన్ ఎక్సెప్టెడ్. ఇలాంటి షరతులకు అస్సలు అంగీకరించకూడదని కూడా చెప్పింది. ఆ తర్వాత… మహిళలు ఆందోళనకు దిగడంతో ఐఫుల్ టవర్ మూసేశారు. ఇప్పుడు… ఇన్‌వెస్టిగేషన్ జరుగుతోంది. కాబట్టి… ఇది హిందూయిజమ్‌ను అటాక్ చేయడం కాదు. ఇది ఇండియాను అటాక్ చేయడం కాదు. మరీ ముఖ్యంగా… ఇది ఫ్రాన్స్ వర్సెస్ హిందూయిజమ్ ఫైట్‌గా మారకూడదు. ఎవరో ఒకరి నమ్మకం, విశ్వాసం కారణంగా… మరొకరిని పక్కకు వెళ్లాలని, కనిపించకుండా ఉండాలని చెప్పడం కరెక్ట్ కాదు.
ఒకవేళ… ఐఫుల్ టవర్‌లో నిజంగా అదే జరిగితే… అప్పుడు… ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిందే! *హూ మేడ్ ద్యాట్ డిసిషన్? ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నారు? హూ అప్రూవ్డ్ ఇట్? ఎవరు అప్రూవ్ చేశారు? అన్నింటికంటే ముఖ్యంగా… ఎందుకిలా జరిగింది? ఇదే ఇప్పుడు… ఈ మొత్తం కాంట్రోవర్సీకి అసలు సెంటర్ పాయింట్!









