MK Stalin : తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ చేసిన ఓ హావభావం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన చేతితో దవడను పట్టుకున్నట్లు కనిపించారు. ఇది డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఎగతాళి చేయడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో పోలీసులు తనను కొట్టారని, ఆ దాడిలో తన దవడ ఎముకలు విరిగిపోయాయని గుర్తు చేసుకున్నారు.

1976లో ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్లలోపే. జైలులో తాము చాలా ఇబ్బందులు పడ్డామని స్టాలిన్ చెప్పారు. ఒక చిన్న గదిలో పది మందిని ఉంచేవారని, అదే గదిలో ఉన్న చిన్న మూత్రశాలను ఉపయోగించాల్సి వచ్చేదని చెప్పారు. ఆ గదిలో చాలా దుర్వాసన ఉండేదని, అక్కడే నిద్రపోవాల్సి వచ్చేదని తెలిపారు.

Also Read : యాపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలిస్తే షాక్‌!

రాత్రిళ్లు కూడా పోలీసులు నిద్రపోనిచ్చేవారు కాదని స్టాలిన్ చెప్పారు. లాఠీలు, బూట్లతో కొట్టేవారని తెలిపారు. కొంతమంది ఖైదీలతో కూడా తమపై దాడులు చేయించేవారని చెప్పారు. తనతో పాటు జైలులో ఉన్న ఎంపీ చిట్టిబాబు కూడా దాడుల కారణంగా జైలులోనే చనిపోయారని తెలిపారు. ఆ దాడిలోనే నా దవడ ఎముకలు విరిగాయి. ఇప్పటికీ ఆ దెబ్బల గుర్తులు ఉన్నాయి అని స్టాలిన్ చెప్పారు.

విజయ్ చేసిన హావభావం సరైనది కాదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు కోసం, తమిళ ప్రజల కోసం పోరాడిన చాలా మంది ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. తమకు పోరాటాలు కొత్తేమీ కాదని అన్నారు. తమిళనాడు, డీఎంకే చరిత్ర గురించి విజయ్ తెలుసుకోవాలని స్టాలిన్ సూచించారు. అన్నాదురైను స్ఫూర్తిగా భావిస్తున్నానని విజయ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ…అన్నాదురై కాలం నుంచి డీఎంకేకు ఒక చరిత్ర ఉంది. అందులో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది అని చెప్పారు.

నా జీవితం, నా పోరాటం గురించి చదువు. నీకు నిజం తెలియదు అంటూ విజయ్‌కు స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, విజయ్ ఇప్పటికే ఈ హావభావంపై వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్‌లో భాగంగా అది అనుకోకుండా జరిగిందని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అయితే ఈ వివాదంపై విజయ్ మిత్రపక్షమైన సీపీఎం కూడా స్పందించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం విజయ్ హావభావాన్ని తప్పుపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఆ దాడిలోనే ఆయన దవడ విరిగిందని గుర్తు చేశారు.

Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.