
Festival Offers : ఆషాడం, శ్రావణం అయిపోయాయి. ఇక వచ్చేవన్నీ పండుగలే. వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ప్రముఖ ఇ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ సంస్థలు రానున్న పండుగులను దృష్టిలో పెట్టుకుని ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించాయి. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ (Amazon Great Indian Festival 2026) పేరుతో తన ఆఫర్ సేల్ తేదీని ప్రకటించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కాగా, పండుగ సీజన్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సేల్ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్ సేల్ ప్రకటించడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు మాత్రం అక్టోబర్ 8నే సేల్ ప్రారంభం కానుంది.
కాగా, అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించింది.ఈ విషయాన్ని అమెజాన్ తన మైక్రోసైట్లో పేర్కొంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 10 శాతం వరకు అదనపు ఆఫర్లు కూడా ఉంటాయని తెలిపింది. అయితే సేల్ ఎప్పటివరకు ఉంటుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. కాగా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా 8 పీఎం డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్ పేరుతో వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఆఫర్ల వివరాలు సేల్ తేదీ దగ్గర పడే కొద్ది వెల్లడించే అవకాశం ఉంది.
అక్టోబర్ 8 నుంచి బిగ్ బిలియన్ డేస్ 2026
మరో ఇ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ సైతం ‘బిగ్ బిలియన్ డేస్ 2026’ సేల్ పేరుతో తన ఆఫర్ల తేదీలను ప్రకటించింది. అమెజాన్ కు ఒక రోజు వెనక అంటే అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం అవనున్నట్లు ప్రకటించింది. ఇది అక్టోబర్ 8న ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. ఎప్పటివరకు అదే సమయంలోనేది మాత్రం వెల్లడించలేదు. కాగా ఫ్లిప్‌కార్డు గతేడాది సెప్టెంబర్ 23న సేల్ నిర్వహించగా.. ఈసారి రెండు వారాల ఆలస్యంగా ప్రారంభం కానుంది.
బిగ్ బిలియన్‌డేస్ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు నిర్వహకుల ప్రకటించారు. ప్లస్ మెంబర్లకు ఈసారి బ్యాంక్ ఆఫర్ కింద 12 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక వెబ్ పేజీ పేర్కొంది. ఆ సందర్భంగా ప్రైస్ క్రాష్, బీబీడీ స్పెషల్, స్టీల్ డీల్, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్, రష్ అవర్స్ పేరుతో వివిధ రకాల సేల్స్ నిర్వహించనున్నట్లు తన మైక్రోసైట్లో వెల్లడించింది. సేల్ తేదీలు దగ్గర పడ్డాక ఆఫర్ల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.









