NEET PG Results : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నీట్ పీజీ 2026 ఫలితాలను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను natboard.edu.inలో చూసుకోవచ్చు. ఈ పరీక్ష 2026 ఆగస్టు 30న జరిగింది. 2.6 లక్షల మంది హాజరయ్యారు. సెప్టెంబర్ 5న జైపూర్‌లో నిర్వహించిన రీ ఎగ్జామ్ కు 2,416 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 720 మార్కులకు గానూ 641 మార్కులు సాధించిన క్యాండిడెట్ కు ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యా్ంకు వచ్చింది. అభ్యర్థుల అప్లికేషన్ సీక్వెన్స్‌ నంబర్‌, రోల్‌ నంబర్‌, సాధించిన స్కోరు, నీట్‌ పీజీ 2026 ర్యాంకులతో కూడిన ప్రత్యేక జాబితాతో పాటు కటాఫ్‌ స్కోరును కూడా విడుదల చేసింది. వ్యక్తిగత స్కోరు కార్డులు ఆక్టోబర్ 1వ తేదీన రిలీజ్ కానున్నాయి. స్కోర్‌కార్డులు విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల పాటు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటాయి.

Also Read : బిహార్‌లో మరో దారుణం.. బాలికపై యువకుల వేధింపులు, వీడియో వైరల్!

Also Read : మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. 9 ముక్కలుగా చేసి బ్యాగుల్లో!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.