Khairatabad Ganesh :  హైదరాబాద్‌ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు, నిమజ్జన మార్గాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. డప్పు చప్పుళ్లు, భక్తులు గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరం మార్మోగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను శోభాయాత్రగా తీసుకొచ్చి హుస్సేన్‌సాగర్‌ లో నిమజ్జనం చేస్తున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో బొజ్జగణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.

Also Read : బాలాపూర్ లడ్డుతో అదృష్టం.. అసలు ఎందుకంత క్రేజ్?

ఈ క్రమంలో ఖైరతాబాద్‌ బడా గణేశుడు కూడా గంగమ్మ ఒడికి చేరాడు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జన కార్యక్రమం ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద పూర్తయింది. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్‌ నుంచి బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌Ganesh Immers మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంది.

అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ల సాయంతో మధ్యాహ్నం 2.15 గంటలకు ఖైరతాబాద్‌ బడా గణేశుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. బడా గణేశుడి నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు ట్యాంక్‌బండ్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు. శోభాయాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్‌ మహాగణపతి ఎదుట డ్యాన్స్‌ చేశారు.

Also Read : ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.