
ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ రాజధాని దోహాలో దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న వివాదాస్పద సుసంపన్న యురేనియం నిల్వల విషయంపై ఆయన స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు.
ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!
ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్లో పడిపోతున్న జననాల రేటు (TFR)….. చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!
జరస్ను ఉంచుకోవడం కరెక్ట్ కాదని..
ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను ఆయన న్యూక్లియర్ డస్ట్ అని పేర్కొన్నారు. ఇంతటి ప్రమాదకరమైన పదార్థాన్ని ఇరాన్ తన వద్ద ఉంచుకోవడం సరికాదని, వెంటనే దానిని అమెరికాకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒకవేళ అప్పగించకపోతే.. అటామిక్ ఎనర్జీ కమిషన్ వంటి అంతర్జాతీయ సంస్థల కఠిన నిఘాలో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Pawan Kalyan : శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు… ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలనం!
దోహాలో జరుగుతున్న చర్చల్లో అమెరికా ప్రతినిధులు, ఇరాన్ అధికారులు, ఖతార్ మధ్యవర్తులు పాల్గొంటున్నారు. ప్రధానంగా కాల్పుల విరమణ, సముద్ర మార్గాల్లో భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై వీరు చర్చించనున్నారు. గతంలో అమెరికా ఇరాన్ భూభాగం నుంచి ఈ యురేనియంను పూర్తిగా తరలించాలని డిమాండ్ చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, పౌర అణు హక్కులను కాపాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఏ ఒప్పందమైనా తమపై ఉన్న ఆంక్షలను తొలగించేలా ఉండాలని టెహ్రాన్ స్పష్టం చేసింది.









