
Balochistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో సైనికుల కాన్వాయ్‌పై మహిళా మిలిటెంట్ యూనిట్ దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది పాక్ సైనికులు చనిపోయారని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించింది. తొలిసారిగా తమ మహిళా యూనిట్ ఈ ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపింది. BLF విడుదల చేసిన వీడియోలో మహిళా సభ్యులు తుపాకులతో పాక్ సైనికుల కాన్వాయ్‌పై కాల్పులు జరుపుతున్న వీడియోలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 22న తుర్బత్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ మార్గంలో వెళ్తున్న మూడు వాహనాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
Also Read : సిలికాన్ వ్యాలీలో కలకలం.. 100 మందికి పైగా పేర్లతో రహస్య జాబితా
مانیٹرنگ :
بلوچستان لبریشن فرنٹ (BLF) نے اپنے میڈیا سیل ’’آشوب‘‘ کے ذریعے اپنے نو تشکیل شدہ ’’کریمہ آرمڈ اسالٹ ڈویژن‘‘ (KAAD) کی ایک ویڈیو جاری کی ہے۔
ویڈیو میں تربت کے علاقے جوسک میں سی پیک روڈ پر کیو آر ایف قافلے پر حملے اور قلات کے علاقے منگچر میں ناکہ بندی اور گاڑیوں کے… pic.twitter.com/m1nb3kxHdI
— Subain Baloch (@subain_bluch) September 28, 2026
కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ పేరుతో ఏర్పాటు చేసిన మహిళా యూనిట్ ఈ దాడిలో పాల్గొన్నట్లు BLF తెలిపింది. దాడికి ముందు ఓ మహిళా కమాండర్ తమ సభ్యులకు సూచనలు ఇస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. BLF అధికార ప్రతినిధి మేజర్ గ్వహ్రామ్ బలోచ్ మాట్లాడుతూ.. దాడిలో పాక్ సైన్యానికి చెందిన పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. తమ మహిళా యూనిట్‌కు ఖుర్బాన్ యూనిట్ సహకరించిందని, చుట్టుముట్టేందుకు ప్రయత్నించిన పాక్ బలగాలను ఎదుర్కొని మహిళా సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. ఈ దాడిలో తమకు చెందిన చకర్ మురాద్ అలియాస్ దిలీప్ జాన్ అనే సభ్యుడు కూడా చనిపోయినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్‌లోని డేరా బుగ్టి ప్రాంతంలో మరి ఎనర్జీస్ లిమిటెడ్‌కు చెందిన ప్రదేశంపై బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ రాకెట్లు, భారీ ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని BRA ప్రతినిధి సర్బాజ్ బలోచ్ తెలిపారు. అనంతరం పాక్ బలగాలకు, స్థానికంగా ఉన్న ఓ సాయుధ బృందానికి మధ్య కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పాక్ సైనికులు, సాయుధ గ్రూపుల సభ్యులు చనిపోయారని ఆయా సంస్థలు వేర్వేరుగా ప్రకటించాయి.
KAADకు కరీమా బలోచ్ పేరు పెట్టారు. ఆమె బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన కార్యకర్త. బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్-ఆజాద్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో కెనడాలోని టొరంటోలో ఆమె మృతదేహం లభించింది. బలూచిస్థాన్‌లో కొంతకాలంగా వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపులు పాక్ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నాయి.
Also Read : సైనిక చర్యలకు సిద్ధమైన అమెరికా.. ఆయుధాలు చేపడుతున్న ఇరాన్ మహిళలు









