
Captain Smit Machchhar : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో గాల్లో ఉండగానే ఊహించని ఘటన జరిగింది. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్ కీలకంగా వ్యవహరించాడు. విమానంలోని మరో పైలట్ విమానాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం బుధవారం ఉదయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది.
అయితే విమానం గాల్లో వెళ్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య గొడవ మొదలైనట్లు ఫ్లైదుబాయ్ తెలిపింది. ఈ విమానంలో 27 మంది చిన్నారులు సహా మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన వివరాల ప్రకారం.. మరో పైలట్ విమానంలోని వ్యవస్థలను పాడు చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిని కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
కాక్‌పిట్‌లో ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో విమానం రెండు నిమిషాల్లో 17,400 అడుగులకు పైగా కిందికి పడిపోయింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలో విమాన సిబ్బందిలో ఒకరు, ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా దించారు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. అనుమానిత పైలట్‌ను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : జింబాబ్వేలో కూలిన హెలికాప్టర్ : ఆరుగురు మృతి
ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
స్మిత్ మచ్చర్ ఇండియన్. గత నాలుగేళ్లుగా ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో ఆయనకు 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు 9,750 గంటలకు పైగా విమానాలు నడిపినట్లు ఆయన లింక్డ్ఇన్ వివరాల్లో ఉంది. ఫ్లైదుబాయ్‌లో చేరకముందు స్మిత్ మచ్చర్ దాదాపు పదేళ్ల పాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన ఆయన అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వదిలి ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్‌గా చేరారు. ఫ్లైదుబాయ్ అనేది ఎమిరేట్స్‌కు అనుబంధంగా పనిచేసే తక్కువ ధరల విమాన సంస్థ.
Also Read : ట్రంప్ మరో బిగ్ షాక్.. EB-5 వీసా ఫీజులు భారీగా పెంపు
ఇంజినీరింగ్ నుంచి పైలట్‌గా..
స్మిత్ మచ్చర్ మొదట తన కుటుంబ వ్యాపారానికి సంబంధించిన టెక్స్టైల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ కోర్సు చేశారు. ఆ సమయంలో జరిగిన ఓ ఏవియేషన్ కార్యక్రమానికి వెళ్లడంతో ఆయనకు పైలట్ కావాలనే ఆలోచన వచ్చింది. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు. అప్పుడే పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. ఆ శిక్షణకు దాదాపు రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఖర్చయిందని ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. తాను పైలట్ కావాలని చెప్పినప్పుడు తన తల్లి భయపడిందని, కానీ తన తండ్రి మాత్రం పెద్దగా ఆందోళన చెందలేదని స్మిత్ మచ్చర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా చేరినట్లు సమాచారం.









