
Naresh : తెలుగు సీనియర్ నటుడు నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత జనరేషన్ లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పిల్లల్ని మాత్రం కనాలని అన్నారు. లివింగ్ టు గెదర్ ఇప్పుడు ఆఫీషియల్ అయిపోయిందన్నారు. క్రేజీ కల్యాణం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ ఈ కామెంట్స్ చేశారు. కోట్ల రూపాయులు ఖర్చు చేసుకుని పెళ్ళిళ్లు చేసుకుంటున్నారని, మళ్లీ విడాకుల కోసం కూడా అన్నే కోట్లు ఖర్చు చేస్తున్నారని నరేష్ తెలిపారు.
Also Read : సూపర్‌స్టార్‌గా ఉండటం కంటే బస్ కండక్టర్‌గానే ఇష్టం : రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుత రోజుల్లో పిల్లలకు పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారిందని నరేష్ అన్నారు. ఎంత ప్రయత్నించినా అనుకున్న విధంగా సంబంధాలు కుదరడం లేదని, ఈ పరిస్థితి నగరాలతో పాటు గ్రామాల్లోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి అని నరేశ్ ఓ వింత సలహ ఇచ్చారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే అంశంపై నేటితరం యువతలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నరేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన మాటలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, నరేశ్ తండ్రీకూతుళ్లుగా ఇందులో కనిపిస్తున్నారు. ఇందులో కూతురికి పెళ్లి చేయాలని తండ్రి పట్టుదలగా ఉండటం, తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని కూతురు ప్రయత్నించడం ఈ కథలో ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Also Read : రణబలి ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ ఊచకోత!









