jio recharge offers
jio recharge offers

ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన నెట్‌వర్క్ వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్‌లతో సర్‌ప్రైజ్ చేస్తున్న సంస్థ.. ఇప్పుడు అధికంగా డేటా వాడేవారికోసం తక్కువ ధరలోనే పిచ్చెక్కించే బెస్ట్ ప్లాన్‌ను ఇస్తోంది. అందులో 5జీ అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్, SMSలు కూడా ఫ్రీగానే పొందొచ్చు. మరి ఆ ప్లాన్ ఏంటి?.. ధర ఎంత?.. బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

Jio రూ.198 plan

Jio అందిస్తున్న అత్యంత చౌకైన 5G ప్లాన్లలో ఇది ఒకటి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ 5G ఇంటర్నెట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా పొందొచ్చు. అంటే ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఎంతసేపైనా నాన్‌స్టాప్‌గా మాట్లాడుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా 4జీ డేటా కూడా సంస్థ కల్పిందించి. అంటే మీ ఏరియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయంలో.. 4జీ వినియోగదారుల కోసం ఈ ప్లాన్ అందిస్తుంది. ఇందులో 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పొందొచ్చు.

అలాగే ఈ ప్లాన్‌లో మరో బెనిఫిట్ కూడా ఉంది. ప్రతిరోజూ 100 SMSలు పొందే సౌకర్యం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ 198 ప్లాన్‌‌తో రీఛార్జ్ చేసుకుంటే కేవలం 14 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. అందువల్ల నెలలో సగం రోజులు మాత్రమే సరిపడేలా బడ్జెట్ ధరలో రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో జియో టీవీ, జియో క్లౌడ్ వంటి బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.