
Meghana Vasireddy : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన విజయం సాధించారు. జనసేన పార్టీ తరఫున 31వ వార్డులో పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మేఘన విజయం సాధించడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. వార్డులో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక రాజకీయాల్లో ఈ గెలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : తూర్పు గోదావరి జిల్లాలో YCPకి బిగ్ షాక్.. కూటమి అభ్యర్థులు క్లీన్‌స్వీప్
కాగావాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చారు. ఆమె ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జగ్గయ్యపేట నుండి వైసీపీ తరపున టికెట్ ఆశించారు. అధిష్టానం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : జగన్ కు బిగ్ షాక్.. పులివెందులలో కూటమి ఆధిక్యం









