kavya

Anirudh :సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు అనిరుధ్ వాటిని కొట్టిపారేస్తూ.. తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచడానికే ఇష్టపడ్డారు.

Also Read : దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!

కానీ, ఇప్పుడు ఈ పెళ్లి వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయిన ప్రముఖ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలే. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరి పెళ్లి గురించి తనకు అందిన సమాచారం ప్రకారం వారు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని అన్నారు. కావ్య మారన్ కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదని, అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను విజయవంతంగా నడిపించే సత్తా ఉన్న మహిళ అని ప్రశంసించారు. తన తండ్రి కళానిధి మారన్ నుండి వ్యాపార మెళకువలను ఆమె పూర్తిగా పుణికిపుచ్చుకున్నారని కొనియాడారు.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్, వ్యాపార వ్యూహాలతో దూసుకుపోతున్న కావ్య మారన్.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఒక మంచి జంట అవుతారని, వారిద్దరూ కలిసి మ్యూజికల్ బిజినెస్’\ చేస్తారంటూ వై.జి. మహేంద్రన్ నవ్వుతూ చమత్కరించారు. అనిరుధ్ సొంత కుటుంబ సభ్యుడే ఈ విధంగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. వీరిద్దరి పెళ్లి దాదాపు ఖాయమేనని నెటిజన్లు భావిస్తున్నారు.

ఈ పరిణామంతో సోషల్ మీడియా అంతా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి పోస్టులతో నిండిపోయింది. ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ, అనిరుధ్ లేదా కావ్య కుటుంబాల నుండి పెళ్లి తేదీ లేదా వివాహ ప్రణాళికలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రెస్ నోట్ రాలేదు. అప్పటివరకు సౌత్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఈ క్రేజీ పెళ్లి వార్త అత్యంత ఆసక్తికరమైన విషయంగానే మిగిలిపోనుంది.

Also Read : కాంట్రవర్సీలతోనే కాసుల వర్షం: ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు ఆర్జిస్తున్న విష్ణుప్రియ..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.