
Ben Stokes : ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి తెరపడనుంది.
బెన్ స్టోక్స్ మైదానంలో బౌలింగ్ వేస్తున్న సమయంలోనే ఈ రిటైర్మెంట్ ప్రకటన రావడం గమనార్హం. 35 ఏళ్ల స్టోక్స్ ఈ టెస్ట్ మ్యాచ్ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తారని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అధికారికంగా వెల్లడించింది. అంతకుముందు లండన్ నైట్‌క్లబ్ ఘటనలో చిక్కుకున్న కారణంగా స్టోక్స్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత నాటింగ్‌హామ్ టెస్ట్‌లో జట్టును నడిపించడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన కేవలం ఈ వారం మాత్రమే కెప్టెన్‌గా ఉంటానని హింట్ ఇచ్చారు.
Also Read : చరిత్ర సృష్టించిన ఆఫ్రికా దేశాలు.. ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ జట్లు ఇవే..!
Ben Stokes Announces Retirement From Tests
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందే స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సహచర ఆటగాళ్లకు తెలియజేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్ అయిన స్టోక్స్.. “నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాననే కారణాలు తర్వాత చెప్తాను. ఈ జట్టు కోసం, మీ కోసం నేను నా శక్తినంతా ధారపోశాను. ఇప్పుడు నా ముందు చివరి అవకాశం ఉంది. నేను కోరేదల్లా ఒక్కటే.. మీరంతా కూడా నా లాగే జట్టు కోసం ఆడండి. మనం ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. ఫలితం ఏదైనా సరే, మ్యాచ్ ముగిసి మైదానం వీడేటప్పుడు ఈ గ్రూప్ అంతా తమ వంద శాతం శ్రమను పెట్టిందని గర్వంగా తల ఎత్తుకుని వెళ్లాలి. నా కోసం మాత్రమే కాకుండా, జట్టు కోసం ప్రతి ఒక్కరూ సర్వస్వం అర్పించాలి. నాలోని ఎమోషన్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యాచ్‌పై దృష్టి పెట్టబోతున్నా, నాతో పాటు మీరంతా రండి” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ నిర్ణయంతో బెన్ స్టోక్స్ 15 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్ ముగియనుంది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో అద్భుతమైన క్షణాలను ఆయన అందించారు. ముఖ్యంగా 2019 వేసవిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో స్టోక్స్ 84 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లాండ్‌కు మొదటిసారి ప్రపంచకప్ అందించారు. క్రికెట్ చరిత్రలోనే అది అత్యుత్తమ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత కేవలం ఆరు వారాలకే యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లేలో ఆస్ట్రేలియాపై ఆయన ఆడిన 135 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం. ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ను కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో గెలిపించి, యాషెస్ సిరీస్ ఆశలను సజీవంగా ఉంచారు. ఆ జ్ఞాపకాలతోనే ఇప్పుడు స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నారు.
Also Read : సీక్రెట్గా హార్దిక్ పాండ్యా పెళ్లి.. సంచలన ఫోటో వైరల్!









