
Donald Trump : తనను గనుక ఇరాన్ దేశం హత్య చేస్తే.. ఆ దేశంపై ఎన్నడూ చూడని స్థాయిలో భారీగా బాంబుల దాడి చేయాలని తాను ఇప్పటికే అధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు న్యూయార్క్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
చాలా కాలంగా తాను ఇరాన్ హిట్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్నానని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. “నేను చాలా కాలంగా వారి టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాను. మనం ఇప్పుడు అలాంటి వారితోనే డీల్ చేస్తున్నాం. అందుకే నేను ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఉంచాను. నాకు గనుక ఏదైనా జరిగితే.. ఇరాన్‌పై వారు తమ జీవితంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో బాంబుల వర్షం కురిపించాలి” అని ట్రంప్ హెచ్చరించారు. అయితే తనను చంపడానికి ఇరాన్ కొత్తగా ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ హెచ్చరించిన వార్తలను మాత్రం ఆయన కొట్టిపారేశారు. కొత్త ప్లాన్ ఏమీ లేదని, కానీ కొన్నేళ్లుగా వారు తనను చంపాలని చూస్తున్న మాట నిజమేనని అన్నారు.
Also Read : POKలో తిరుగుబాటు.. చేతులెత్తేసిన పాక్ సైన్యం: రంగంలోకి 4 వేల మంది అదనపు బలగాలు!
“నేను ఇరాన్ హిట్ లిస్ట్‌లో నంబర్ వన్. జీవితం ఇలాగే ఉంటుంది, అయినా మీరు నన్ను మిస్ అవుతారని అనుకుంటున్నాను” అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సు ముగించుకుని అమెరికా తిరిగి వస్తున్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ తన ప్రయాణ ప్రణాళికలను కూడా మార్చుకున్నారు. గతంలో ఇరాన్ మిలిటరీ ఆఫీసర్ ఖాసీం సులేమానీని చంపాలని ట్రంప్ ఆదేశించినప్పటి నుండి ఆయన ఇరాన్‌కు ప్రధాన శత్రువుగా మారారు.
మరోవైపు ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిపోయిందని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ వైపు నుండి చర్చలు జరిపిన వారిని ‘క్రిమినల్స్’ అని పిలుస్తూ.. వారితో మాట్లాడటం సమయం వృథా అని అన్నారు. ఇటీవల ఇరాన్‌లోని 80 ప్రాంతాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “వారితో మాట్లాడటం పూర్తిగా సమయం దండగ. వారు చాలా క్రూరమైన, హింసాత్మకమైన ప్రజలు. నాకైతే ఈ ఒప్పందం ఇక్కడితో ముగిసిపోయింది” అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల సమయంలో కూడా టెహ్రాన్ నగరంలో డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను చంపాలంటూ భారీగా నినాదాలు చేయడం, పోస్టర్లు వెలియడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : నన్ను చంపేసినా పర్వాలేదు… స్వదేశానికి వెళ్లిపోతా… షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు









