
Chhattisgarh : ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రతినెలా దుకాణాల ముందు గంటల తరబడి లైన్లలో నిలబడే బాధ ఇకపై ఉండదు. ఈ ఇబ్బందిని తప్పించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. అదే అన్నపూర్ణ గ్రెయిన్ ఏటీఎం. ఈ మిషన్స్ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారు ఎవరి సహాయం లేకుండా, తమకు నచ్చిన సమయంలో సులభంగా బియ్యం తీసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువసేపు లైన్లలో నిలబడాల్సిన పనితప్పుతుంది. ఈ మిషన్ ద్వారా బియ్యం ఎలా తీసుకోవాలో చాలా మందికి సందేహం రావచ్చు. కానీ దీనిని ఉపయోగించడం చాలా ఈజీ.
Also Read : కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ నిబంధనలు తెలుసా?
ఈ మిషన్ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడానికి ఈ క్రింది చిన్న స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మొదట మిషన్ స్క్రీన్ మీదలేదా మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ వేలిముద్ర వేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇలా వివరాలు చెక్ అయిన వెంటనే, మీకు రావాల్సిన బియ్యం నేరుగా ఆ మిషన్ నుంచి కిందకు వస్తాయి.ఈ సేవలు దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్ లో ప్రస్తుతానికి ఫ్రారంభించారు. ఈ గ్రెయిన్ ఏటీఎంల ద్వారా లబ్ధిదారులు రోజులో 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ ఎప్పుడైనా వెళ్లి రేషన్ తీసుకోవచ్చు.
ఈ సేవలను కేవలం ఛత్తీస్‌గఢ్ ప్రజలే కాకుండా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఒక దేశం – ఒక రేషన్ కార్డు నిబంధన కింద ఇది పనిచేస్తుంది. అయితే రేషన్ తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ వేయడం మాత్రం తప్పనిసరి.
Also Read : అబ్బాయిలకు చెప్పండి బుద్ధి.. అమ్మాయిల జీన్స్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు !









