మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్ వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.







