
TGSWREIS : 2027 ఏడాదికిగాను వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET UG 2027) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) గుడ్ న్యూస్ చెప్పింది. నీట్ పరీక్షలకు అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తామని ప్రకటించింది. దీనికోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద వివరించారు.
Also Read : 22ఏ భూముల వివాదం.. అప్పటి వరకు ఛాన్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
2026 -27 అకడామిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించే లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్‌ను అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నిర్వహిస్తామన్నారు. కాగా, దరఖాస్తు దారుల నుంచి ఎంపిక చేసిన మొత్తం 200 మందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తామని వారు వెల్లడించారు. ఇందులో ఎంపికైన 100 మంది బాలురకు చిలుకూరులోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీవోఈలోనూ, 100 మంది బాలికలకు మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ వద్ద శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ కార్యదర్శి శారద వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఏదేని కాలేజీలో బైపీసీలో ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులని ఆమ వివరించారు. అలాగే, 2026 నీట్ పరీక్ష రాసిన వారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె వివరించారు.
కాగా ఈ ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తమ అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తును పొందాలని సూచించారు. అనంతరం దరఖాస్తు నింపి, అన్ని ధ్రువపత్రాలను జత చేసి సంబంధిత అప్లికేషన్‌ను ఎక్కడైతే కోచింగ్ ఇస్తున్నారో ఆ కేంద్రలైన చిలుకూరు, మహేంద్రహిల్స్లలోని ఆయా కాలేజీల్లో టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా సమన్వయకర్త (డీసీవో) ద్వారా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉచిత శిక్షణకు ఎలాంటి దరఖాస్తు రుసుం లేదని పూర్తిగా ఉచితంగానే శిక్షణ ఇస్తామని తెలిపారు.
Also Read : తెలంగాణలో కోటికి పైగా ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!









