
Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగ్రవాద మూలాలు ఉన్నాయనే అనుమానంతో పశ్చిమ బెంగాల్‌కూ చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా దాడులు చేసేందుకు తెహ్రీక్-యే-తాత్కాలిక తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థతో చేతులు కలిపేందుకు ఈ యువకుడు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : మా గొంతును అణచివేయాలనుకుంటే భయపడం.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే
అరెస్టు అయిన యువకుడిని పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అసఫుల్ మాలిక్‌గా పోలీసులు గుర్తించారు. అతను బెంగళూరులోని జిగణి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నివాసముంటున్నాడు. బొమ్మసంద్ర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇతని ఆన్లైన్ అనుమానాస్పద కార్యకలాపాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్‌లోని మసీదులు, పౌరులపై అక్కడి ఆర్మీ జరుపుతున్న దాడులపై కోపంతోనే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అసఫుల్ మాలిక్ అంగీకరించాడు. ఫేస్బుక్ ద్వారా అఫ్గానిస్తాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్ అనే వ్యక్తితో ఇతనికి పరిచయం ఏర్పడింది. టీటీపీ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇమ్రాన్ సాయంతో అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ పాక్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని మాలిక్ ప్లాన్ చేశాడు. అందుకోసం వీసాకు కూడా అప్లై చేశాడు. కానీ, ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబ బాధ్యతల వల్ల చివరి నిమిషంలో ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు చెప్పాడు.
అసఫుల్ మాలిక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తీవ్రవాదులతో అతను జరిపిన చాటింగ్‌లు, వాయిస్ రికార్డింగ్‌లు, ఆడియో సంభాషణలను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి దేశంలో ఏమైనా దాడులు చేసే ప్లాన్లు ఉన్నాయా, ఇతని వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో బెంగళూరు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read : మోదీ జీ .. ఐర్లాండ్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారా?.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్!









