
Arjuna Awards : క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన అర్జున అవార్డులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలు-2025ను అధికారికంగా ప్రకటించింది. జాతీయ క్రీడా రంగంలో స్థిరంగా రాణిస్తూ అంతర్జాతీయ వేదికల భారత జెండాను రెపరెపలాడించిన అథ్లెట్లకు అర్జున అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రతినిధుల కమిటీ ఈ తుది జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది అర్జున అవార్డు గ్రహీతల జాబితాలో వివిధ రకాల క్రీడలకు సమాన ప్రాధాన్యత దక్కడం గమనార్హం.
Also Read : నేడు ఈ రాశులకు బిగ్ అలర్ట్.. ఈ జాగ్రత్త పాటించకపోతే సమస్యలు తప్పవు
బ్యాడ్మింటన్ క్రీడలో తెలంగాణ నుంచి పుల్లెల గోపీచంద్ తనయురాలు గాయత్రి గోపీచంద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెతో పాటు కేరళకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ ట్రీసా జాలీకి కూడా పురస్కారం దక్కింది. చెస్, షూటింగ్, పారా అథ్లెటిక్స్ విభాగాల నుంచి పలువురు యువ చాంపియన్లు అవార్డు జాబితాలో నిలిచారు. మహమ్మద్ అజ్మల్- అథ్లెటిక్స్, తేజస్విన్ శంకర్- అథ్లెటిక్స్, ప్రియాంక గోస్వామి- అథ్లెటిక్స్, త్రిషా జాలీ- బ్యాడ్మింటన్, పుల్లెల గాయత్రి గోపీచంద్- బ్యాడ్మింటన్, నరేందర్- బాక్సింగ్, విదిత్ సంతోష్ గుజరాతీ- చెస్.. అర్జున అవార్డులను దక్కించుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్- చెస్, ధనుష్ శ్రీకాంత్- డెఫ్ షూటింగ్, లాల్రెమ్సియామి- హాకీ, రాజ్‌కుమార్ పాల్- హాకీ, సుర్జీత్- కబడ్డీ, పూజ- కబడ్డీ, రుద్రాన్ష్ ఖండేల్వాల్- పారా షూటింగ్, ఏక్తా భ్యాన్- పారా అథ్లెటిక్స్, అరవింద్ సింగ్- రోయింగ్, అఖిల్ షెరాన్- షూటింగ్.. అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.
ఫుట్‌బాల్ కు దశాబ్దాలుగా చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు లైఫ్‌టైమ్ పురస్కారానికి అరుమై నాయగంను ఎంపిక చేశారు. క్రియాశీల క్రీడల నుంచి విరమించుకున్నప్పటికీ, యువతలో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం కష్టపడే సీనియర్ క్రీడాకారులను గౌరవించడానికి ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్నిఎగురవేయడానికి క్రీడాకారుల వెనుక ఉండి నడిపించే కోచ్ లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ద్రోణాచార్య అవార్డు కు ఎంపికైన వారిలో పర్వీర్ సింగ్- అథ్లెటిక్స్, ఛోటే లాల్ యాదవ్- బాక్సింగ్, నేహా నందకుమార్ చవాన్- షూటింగ్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు బాక్సింగ్ లో ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ లో వీరేందర్ కుమార్ కు ద్రోణాచార్య లైఫ్‌టైమ్ పురస్కారం లభించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ విభాగంలో ఈ సారి పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్ ఎంపికయింది.
Also Read : ఇన్‌స్టాలో దిమాగీ నక్సల్ పార్టీ సంచలనం.. ఒక్కరోజులోనే 1.6 లక్షల ఫాలోవర్స్!









