
JHCHBS : జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (JHCHBS) ఎన్నికలకు సంబంధించి తెలంగాన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికలకు మార్గం సుగమం చేసిన తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (JHCHBS) ఎన్నికలకు సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. తక్షణ, నిష్పక్షపాత, పారదర్శక ప్రజాస్వామ్య ప్రక్రియకు మార్గం సుగమం చేసింది. గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో, సరిగ్గా అదే దశ నుండి తక్షణమే ఎన్నికల కార్యక్రమాలు పునఃప్రారంభించాలని ఆదేశించింది.
Also Read : 22-A అంటే ఏమిటీ? పట్టా భూములకు తప్పని తిప్పలు..
అలాగే పూర్తి సమగ్రతను కాపాడటానికి ఎటువంటి చేర్పులు, తొలగింపులు లేదా మార్పులకు అనుమతి ఉండదని తెలిపింది. ప్రస్తుత ఓటర్ల జాబితానే తుది జాబితాగా ఉంటుందని తెలిపింది.ఈ ప్రక్రియ పూర్తిగా సరైన రీతిలో దాఖలైన నామినేషన్లతోనే కొనసాగుతుంది. కొత్త దరఖాస్తులకు ఎటువంటి అనుమతి ఉండదని తేల్చి చెప్పింది. కాగా హైకోర్టు నిర్ణయం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది, సభ్యుల హక్కులను రక్షిస్తుంది, ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా, నిష్పక్షపాతంగా ముగిసేలా భరోసానిస్తుందని సోసైటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకుంటూ, మన సొసైటీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అందరం సంపూర్ణంగా భాగస్వామ్యం అవుదాం అంటూ సొసైటీ పిలుపునిచ్చింది.
కాగా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం ఎన్నికల ప్రక్రియ న్యాయ స్థానం జడ్జిమెంట్‌ను వెలువరించిన తేది నుంచి 8 వారాలలో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే ఎన్నికల తేది, ఎన్నికలు నిర్వహించే వేదికకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని సొసైటీ తెలిపింది.
Also Read : ‘భరిస్తున్నా అంతే.. జీవన్‌రెడ్డిలా తిరగబడతా’… సీఎం రేవంత్‌రెడ్డికి చిన్నారెడ్డి వార్నింగ్









