Konda Sushmita : పరకాల నియోజకవర్గం విషయంలో ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తూ హాట్‌ కామెంట్స్ చేశారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కావాలని కోరింది మొదట కొండా దంపతులే అని, ఆయన గెలిచాక మా ఇంటికి వచ్చారా లేదా అని ప్రశ్నించింది. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదని ఆరోపించింది. ఇంతవరకు మురళికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించింది. రెండు, మూడు నియోజక వర్గాల్లో తిరిగి గెలిపించింది కొండా మురళి.మురళిని రేవంత్‌ రెడ్డి మోసం చేశారని ఆరోపించింది. రేవూరిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తనని బీసీ బిడ్డను మోసం చేశారని సుస్మిత ఆరోపించింది. గీసుగొండ మండలం మాకు కొండంత అండ. 9ఏళ్లు నరకం చూసాం.కొండా దంపతులు మంచోళ్లు కాబట్టి ఇన్నాళ్లు ఊరుకున్నారని సుస్మిత తేల్చి చెప్పింది. కొండా మురళి మాములు లీడర్‌ కాదని ఆయన కింగ్‌ మేకర్‌ అంటూ సుస్మిత ప్రకటించింది. బీసీ బిడ్డకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు.రేవూరిని గెలిపియ్యాలని చెప్పి వెళ్ళావు. సీఎం అయితే నీకు కళ్ళు నెత్తికి ఎక్కయా…? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు రాండి.పరకాలలో నా ఇళ్ళు ఇస్తా, అక్కడే ఉండి రేవూరిని గెలిపించుకో.రేవూరి గెలుస్తాడో…కొండా మనిషి గెలుస్తాడో చూద్దాం. అంటూ సవాల్‌ విసిరింది.

Also Read : రాష్ట్ర కాంగ్రెస్‌లో  కొత్త లొల్లి… పరకాలలో కొండా సుస్మిత ఎంట్రీతో రాజుకున్న అగ్గి

కాంగ్రెస్ సంస్కృతి నీకు ఎక్కలేదు.టీడీపీ సభ్యులంటే నీకు ప్రేమ ఎందుకు…?కాంగ్రెస్ సభ్యులు అంటే ఎందుకు వివక్ష…? డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి ఎలా టికెట్ ఇస్తానన్నావు. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో కనీసం మంత్రి పొన్నం ఫోటో కూడా వేయలేదు.బీసీ నేతలంటే నీకు చులకన. టికెట్లు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుంది.119 నియోజకవర్గాల్లో టికెట్లను నువ్వే ప్రకటించు, అధిష్టానం ఎందుకు. అంటూ సీఎంను కొండా ఎద్దేవా చేసింది.వేం నరేందర్‌ రెడ్డి మాటలు రేవంత్‌ ఎన్నిసార్లు విన్నాడని, అసలు ఆయన ఇస్తున్న సలహాలు ఏంటీ అని సుస్మిత ప్రశ్నించింది. గీసుగొండ మండలం మాకు కొండంత అండ. 9ఏళ్లు నరకం చూసాం.

పరకాలలో రేవూరి ప్రకాశ్‌ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించింది. ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే ఆయన పోటీ చేస్తారని ఎలా ప్రకటిస్తారని సుస్మిత ఫైర్‌ అయ్యారు. అసలు పరకాలలో రేవూరి ఎవరికీ తెలుసు అంటూ సుస్మిత ప్రశ్నించింది. పరకాలలో పోటీచేసేది నేనే గెలిచేది నేనే అంటూ సుస్మిత సవాల్‌ విసిరింది. రేవంత్‌ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలెవరూ సంతోషంగా లేరని ఆమె స్పష్టం చేశారు. పరకాలలో నన్ను ఎవరు ఆపలేరు అని, త్వరలో పరకాలలో ఇల్లు కట్టుకోవడంతో పాటు ఇక్కడే ఉంటానని శపథం చేసింది. నా ఇలాకాకు వచ్చి మాతో పెట్టుకుంటారా అని ఫైర్‌ అయింది. పరకాలకు కాబోయే ఎమ్మె్ల్యేను తనేనంటూ ప్రకాశ్‌ రెడ్డికి సవాల్‌ విసిరింది సుస్మిత. రానున్న 20 ఏండ్లు పరకాల ఎమ్మెల్యేను తానేనంటూ సుస్మిత తేల్చి చెప్పింది.

Also Read : రూపా రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది ఎవరంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.