Mecca Pact : పశ్చిమాసియాలో ఒక వైపు ఘర్షణలు కొనసాగుతుండగానే పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’ కుదుర్చుకోవడం గమనార్హం. కాగా, ఇంకా పలు దేశాలు ఈ మక్కా ఒప్పందంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఒప్పందంలో చేరాలని ఇరాన్‌ (Iran)కు ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది. తమకు అందిన ఆహ్వానంపై సమీక్ష జరుపుతున్నామని, ఇది టెహ్రాన్‌కు దక్కిన విజయమని ఇరాన్ కీలకనేత మెహ్దీ రహీమీ పేర్కొన్నట్లు పశ్చిమాసియాలోని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆహ్వానాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ధ్రువీకరించాల్సి ఉంది.

Also Read : అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం ?

సౌదీ అరేబియాకు ఇరాన్ అనుబంధ గ్రూప్ హూతీలకు మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాంటప్పుడు ఇరాన్‌కు ఈ ఆహ్వానం వెళ్లే అవకాశం ఉంటుందా..? అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్, నాటో సభ్య దేశమైన తుర్కియే, చమురు నిల్వలతో సుసంపన్నమైన సౌదీ అరేబియా మధ్య జరిగినఈ సంయుక్త రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశగా మారింది. నాటో కూటమి మాదిరిగానే ‘సభ్య దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా అది తమందరిపై జరిగిన దాడిగా మిగిలినవి భావిస్తాయి’ అనే నిబంధనను ఈ ఒప్పందంలో చేర్చడం పై ప్రపంచ దేశాలు అచితూచి స్పందిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియా వ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంత దేశాలు అమెరికా రక్షణ ఛత్రం నుంచి క్రమంగా బయటకు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా దేశాలు కూటమిగా ఏర్పడే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇరాన్ (Iran) ఈ ఒప్పందంలో చేరితే.. హూతీలపైనే దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటపుడు ఈ ఆహ్వానం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

Also Read : పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న టర్కీ యుద్ధ విమానాలు.. అసలేం జరుగుతోందంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.