
మేషం
తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవ దర్శనం మంచిది.
వృషభం
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి అనుకూల సమయం. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
మిథునం
పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్టదేవతను ఆరాధించండి.
కర్కాటకం
పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శివదర్శనం శ్రేయస్కరం.
సింహం
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. శ్రీరామనామ జపం మంచిది.
కన్య
పనుల్లో స్వల్ప అవరోధాలు ఎదురైనా అధిగమిస్తారు. పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సూర్యాష్టకం పఠించండి.
Also Read : అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్‌లకు బిగ్ షాక్.. ఫుడ్ లైసెన్సులు రద్దు చేసిన కర్ణాటక గవర్నమెంట్
తుల
ఆశించిన ఆర్థిక వనరులు సమకూరి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆస్తి యత్నాలు కలసివస్తాయి. శని శ్లోకం చదవండి.
వృశ్చికం
వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు మానసికంగా నిరుత్సాహపరచవచ్చు. గోసేవ చేయడం మేలు చేస్తుంది.
ధనుస్సు
కుటుంబ సభ్యులు, సహచరుల ప్రోత్సాహంతో అనుకున్నవి సాధిస్తారు. ఆర్థిక స్థితి తృప్తికరంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించండి.
మకరం
శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
కుంభం
మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. శివారాధన శుభప్రదం.
మీనం
పనిభారం పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివారాధన మనోబలాన్ని ఇస్తుంది.
Also Read : లేచిన వెంటనే టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఈ అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు!









