Thursday, May 21, 13:35
37.7 C
Hyderabad

Afghanistan: అఫ్ఘానిస్తాన్‌లో ఆకలి కేకలు.. తిండి కోసం బిడ్డలను అమ్మేస్తున్న తల్లితండ్రులు

Afghanistan
Afghanistan

Afghanistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అఫ్ఘానిస్థాన్‌ కొట్టుమిట్టాడుతోంది. కనీస తిండి, అత్యవసర వైద్య ఖర్చులు లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. చివరికి నిరుపేద కుటుంబాలు కూటి కోసం తమ బిడ్డలను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరుద్యోగం పెరగడం, ఆరోగ్య రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోవడం, అంతర్జాతీయ సాయం నిలిచిపోవడం లాంటి పలు కారణాల వల్ల అఫ్ఘాన్‌లోని ప్రతి నలుగురిలో ముగ్గురు తమ ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి (UN) వెల్లడించింది. దేశ జనాభాలో సుమారు 10 శాతం మంది.. అంటే దాదాపు 47 లక్షల మంది ప్రజలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నట్లు పేర్కొంది.

Also Read: అభినయ్‌ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్

ముఖ్యంగా ఘోర్ ప్రావిన్సులో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కటిక పేదరికం, అప్పుల ఊబి నుంచి విముక్తి కోసం, కుటుంబాన్ని పోషించే స్తోమత లేక అబ్దుల్ రషీన్ అనే వ్యక్తి తన ఏడేళ్ల వయసున్న కవల కుమార్తెలను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న చాలా కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కూతుళ్లను విక్రయించే పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: కుప్పంలో తాటి ముంజలు తిన్న చంద్రబాబు.. అవి తింటే ఎన్నిలాభాలతో తెలుసా?

మరోవైపు దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల చిన్నారుల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అపెండిసైటిస్, కాలేయంలో గడ్డ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన ఐదేళ్ల కుమార్తెకు వైద్య చికిత్స కూడా ఇప్పించలేని స్తోమత లేక ఓ తండ్రి తన బిడ్డను అమ్మేశాడు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా అప్గాన్‌ సాయం అందకపోవడం, దేశీయంగా ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల వేలాది నిరుపేద కుటుంబాలు నరకాన్ని అనుభవిస్తున్నాయి.

Also Read: ప్రమాదాల వెనుక కుట్ర కోణం…రైల్వేశాఖ సంచలన విషయాలు!