
Andhra Pradesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 మేయర్ పదవులు కేటాయించారు.
Also Read : విశాఖ హైవేపై సినిమా రేంజ్లో ఛేజింగ్.. దొరికేసిన రూ.8.98 కోట్ల విలువైన గోల్డ్..!
కార్పొరేషన్ల వారీగా మేయర్ రిజర్వేషన్ల జాబితా:
బీసీ మహిళలు (2):కాకినాడ, మచిలీపట్నం
బీసీ జనరల్ (3):ఏలూరు, అనంతపురం, చిత్తూరు
ఎస్సీ (2): కర్నూలు, రాజమండ్రి
ఎస్టీ (1): మంగళగిరి / తాడేపల్లి
మహిళలు – జనరల్ (5):విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం
న్రిజర్వ్డ్ / జనరల్ (4):తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు
Also Read : పండుగలొచ్చాయ్: వారెవ్వా.. ఇలా చేస్తే ట్రైన్ టికెట్ కన్ఫార్మ్..! డోంట్ మిస్









