
Konda Surekha : తన పుట్టిన రోజు సందర్భంగా తన కూతురు కొండా సుస్మిత చేసిన కామెంట్ల గొడవ సద్దు మణగకముందే మంత్రి సురేఖకు మరో షాక్ తగిలింది. గతంలో మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ మేరకు బాధితుడు గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమంత్ తన అనుచరులతో కలిసి తనపై ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా మేడిపల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 అంటే.. హత్యాయత్నం కింద సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
జీరో ఎఫ్‌ఐఆర్ – జూబ్లీహిల్స్‌కు బదిలీ:
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తనపై సుమంత్‌తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు హరికృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. సుమంత్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు వివరించారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. కాగా ఇదివరకే పలు అవినీతి, వసూళ్ల ఆరోపణలతో ప్రభుత్వం సుమంత్‌ను OSD బాధ్యతల నుంచి తొలగించిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం హత్యాయత్నం కేసు కూడా నమోదవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది.









