
Gurugram : గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 55లో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఇషారా అయూబీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ ప్రాంతానికి చెందినది. కొద్ది రోజులుగా ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో, ఆందోళన చెందిన వారు సెక్టార్ 56 పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, ఇషారా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఆమెను కత్తితో పదుల సార్లు పొడిచి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read : ఘోర ప్రమాదం: రెండు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి, 41 మందికి గాయాలు!
ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే, ఘీ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఒక యువకుడి మృతదేహం ముక్కలై కనిపించింది. అతడు చత్తీస్‌గఢ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రేష్ఠ మాలిక్ (25)గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇషారా హత్యకు, ఈ ఆత్మహత్యకు సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించారు. ఇషారా, శ్రేష్ఠ మాలిక్ కలిసి ఉంటున్నారని, ఘటనకు కేవలం మూడు రోజుల ముందే వారు ఆ ఇంటికి మారారని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యకు గల కారణాలు, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరి ఫోన్ కాల్ రికార్డులు, చాటింగ్ వివరాలు మరియు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read : ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ , ఇద్దరు పిల్లలు.. ఎలా చంపాలని అనిపించిందిరా దుర్మార్గుడా!









