
Tollywood : ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో ట్రెండ్ పూర్తిగా మారింది. స్టార్ హీరోల ఇమేజ్ కంటే, కథలోని కంటెంట్‌కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలో కంటెంట్ బాగుంటే చాలు.. థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. స్టార్ డమ్ కంటే సబ్జెక్ట్ నమ్ముకున్న సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. ఇందుకు తాజాగా విడుదలైన రెండు సినిమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది. అలాగే అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ సినిమా కూడా అద్భుతమైన స్పందన అందుకుంటోంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 60 కోట్ల వసూళ్లను సాధించి, దూసుకుపోతోంది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు కూడా ఏం పెంచలేదు కూడా.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం: స్పష్టత ఇచ్చిన ఫ్యాన్స్ అసోసియేషన్
ఈ విజయాలు చూస్తుంటే, ప్రేక్షకులకు అనవసరమైన హంగులు, భారీ బడ్జెట్ హంగామా కంటే.. మనసుకు హత్తుకునే కథలే ముఖ్యమని స్పష్టమవుతోంది. కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడూ ఆదరిస్తాం అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా కొన్నిసార్లు ఫ్లాప్ అవుతున్న తరుణంలో, ఈ సినిమాల విజయం చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలకు ఒక కొత్త భరోసాని ఇస్తున్నాయి. మొత్తం మీద, సినిమా రంగంలో కంటెంట్ ఈజ్ కింగ్ అని ఈ ఫలితాలు మరోసారి చాటి చెబుతున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే.. వీళ్లందరి లైఫ్‌లో పెళ్లి తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను చూశారు. ఒక ఇంటివారైతే లక్ కలిసివస్తుంది అనే పాత సామెత ఇప్పుడు టాలీవుడ్ లో సెంటిమెంట్ గా మారింది. సమంత రెండో వివాహం రాజ్ నిడుమూరితో కాగా, అఖిల్ వివాహం జైనాబ్ రావ్డ్జీతో జరిగింది.
Also Read : నా తండ్రి బతిమిలాడితే చూశాను .. భాగ్యశ్రీ ఎమోషనల్!









