
AI చిప్ డిజైన్ దిగ్గజం ఎన్విడియా ఇప్పుడు ఒక భారీ సంక్షోభంలో చిక్కుకుంది. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిస్ హువాంగ్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ నడిపిన ప్రేమ వ్యవహారం టెక్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. మరోవైపు, ఆలిస్ భర్త కాంగ్ వెయ్, చైనా ప్రభుత్వ అండతో ఏకంగా 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,956 కోట్లు) భారీ డేటా సెంటర్ సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, 2021-2024 మధ్య కాంగ్ వెయ్ నెట్వర్క్ చైనాలో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. ‘సెంచరీ లాంగ్టెంగ్’ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టిన కాంగ్, అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న హువావేతో చేతులు కలిపారు. చైనాలోని వుహులో రూ. 41,987 కోట్లతో 24,000 సర్వర్ ర్యాక్‌ల సామర్థ్యం గల ఇంటెలిజెంట్-కంప్యూటింగ్ పార్క్, అలాగే సిచువాన్‌లో 5 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
మెగాస్పీడ్ ద్వారా ఎన్విడియా చిప్‌ల తరలింపు
అమెరికా ఎగుమతి ఆంక్షలను దాటుకుని, ఎన్విడియా అడ్వాన్స్డ్ ఏఐ చిప్‌లను చైనాకు చేరవేయడానికి ఆలిస్ హువాంగ్ సింగపూర్ ఆధారిత క్లౌడ్ కంపెనీ ‘మెగాస్పీడ్’ను వాడుకున్నారు. ఎన్విడియా క్లౌడ్ పార్ట్నర్ హోదా పొందిన మెగాస్పీడ్, అలీబాబా తమ ప్రధాన కస్టమర్ అని చెప్పి ముందుగానే చిప్‌లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వాటిని చైనాకు పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి.
గతంలో వీడియో-గేమ్ ఇండస్ట్రీ నుండే జెన్సన్ హువాంగ్‌కు కాంగ్‌తో పరిచయం ఉంది. కాంగ్ ద్వారానే ఆలిస్, జెన్సన్కు దగ్గరయ్యారు. మెగాస్పీడ్ డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్న తర్వాత కూడా, సింగపూర్ మరియు తైపీలోని కంప్యూటెక్స్ ఈవెంట్లలో జెన్సన్, ఆలిస్ కలిసి కనిపించారు. చైనా గూఢచార సంస్థలకు సమాచారం అందిందనే ఆరోపణలు, ఎగుమతి నిబంధనల ఉల్లంఘనపై అమెరికా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేశారు.
మూడేళ్లలో పెట్టుబడిని మూడు రెట్లు చేస్తామని, ఎన్విడియా చిప్‌లను చైనాకు తెస్తామని హామీ ఇస్తూ ఈ దంపతులు ఆగ్నేయాసియాలో నిధులు సేకరించినట్లు సమాచారం. అయితే, మెగాస్పీడ్ మాత్రం తమ వ్యాపారం చట్టబద్ధమైనదని, ఆలిస్‌కు తమ సంస్థతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.









