Ayodhya Ram Mandir Trust : గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న అయోధ్య రామాలయ ట్రస్ట్ సీఈఓ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను సీఈవోగా ఎంపిక చేస్తూ  జన్మభూమి ట్రస్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, సీఈవో కోసం 5,585 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన కమిటీ.. 39 ఏళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించిన జితేంద్ర మిశ్రాను ఆలయ ట్రస్ట్‌ సీఈఓగా నియమిస్తున్నట్టు ప్రకటిస్తూ తుది నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల విరాళాల చోరీ కేసులో ఆయోధ్య వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. కాగా,  రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన విషయం తెలిసిందే.  దాదాపు 5,500కి పైగా దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : నాపై కక్ష.. ముందు సీఎంను తీసేయండి.. కొండా సురేఖ సంచలన కామెంట్స్!

కాగా, రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించిన కమిటీ, వారిలో16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిసింది. వారితో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించినట్లు తెలిపింది. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించి 108 మంది అర్హత పొందారన్నారు.

వీరందరికీ నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు.  వారిలో  ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించినట్లు తెలిపారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించామని వారు తెలిపారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల మూలంగా ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టినట్లు ట్రస్ట్‌ తెలిపింది.

జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో అనేక ఉన్నత పదవులను నిర్వహించారని ట్రస్ట్‌ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు చీఫ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మిశ్రా పదవీవిరమణ చేశారన్నారు. అయోధ్యలో విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో సీఈఓగా ఎంపికైన ఆయనపై రామమందిర నిర్వహణ, ఆర్థిక జవాబుదారీతనాన్ని పటిష్టం చేసే బృహత్తరమైన బాధ్యత ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది.

Also Read : రామ్ జన్మభూమి ట్రస్ట్ తొలి CEO కోసం ముగ్గురు అభ్యర్థులు షార్ట్‌లిస్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.