Bilaspur : చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ విమానాశ్రయంలో శుక్రవారం ఒక విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్ వస్తున్న అలైన్స్ ఎయిర్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 41 మంది అందరూ క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

అలైన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానం 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 41 మందితో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బిలాస్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో దాని ఎడమ వైపు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది.

అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులు, సిబ్బందిని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా రన్‌వే నుంచి టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. ఈ ఘటన కారణంగా బిలాస్‌పూర్ నుంచి తిరిగి వెళ్లాల్సిన తదుపరి విమాన సర్వీస్‌ను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.