anirudh ravichander kavya maran wedding confirmed
anirudh ravichander kavya maran wedding confirmed

సాధారణంగా సెలబ్రిటీల లవ్, మ్యారేజ్ రూమర్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్నో రూమర్స్ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో రూమర్స్ లవ్ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుంది. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్. ఈ కోలీవుడ్ స్టార్ తన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.

Also Read : హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవమానం.. స్టేజ్ పైనే షాకిచ్చిన సీఎం భార్య!

అదే సమయంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా, ప్రముఖ వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కావ్య మారన్. వీరిద్దరూ కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ జంట ఎన్నడూ దానికి సమాధానం చెప్పలేదు. కానీ తాజాగా అనిరుధ్ బంధువే వీరి పెళ్లి విషయం గుట్టు రట్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో అనిరుధ్, కావ్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి వీరి పెళ్లి గురించి చెప్పిన ఆ వ్యక్తి ఎవరు?.. ఆయన ఏం చెప్పారు? అనే విషయానికొస్తే..

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనిరుధ్ దగ్గరి బంధువు ప్రముఖ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ వెల్లడించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ వ్యా్ఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు అనిరుధ్, కావ్య రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుందని ఆయన వెల్లడించారు. అనిరుధ్ మంచి వ్యక్తి అని.. వినయపూర్వకమైన స్వభావం కలవాడని అన్నారు. అతను పెద్ద ఇంట్లోకి అల్లుడిగా వెళ్తున్నాడని చెబుతూ.. తన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : షాకింగ్‌… తల్లి కాబోతున్న సమంత?

అలాగే కావ్యా మారన్ ప్రతిభను ఆయన ప్రసంశించారు. ఆమె కేవలం సాధారణ అమ్మాయి కాదని అన్నారు. SRH లాంటి పెద్ద టీంను సమర్థవంతంగా నడిపిస్తున్న లీడర్ అని కావ్యాను పొగడ్తలతో ముంచెత్తారు. వీరిద్దరి పెయిరింగ్ చాలా బాగుంటుందని అన్నారు. మ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి పెద్ద మ్యూజిక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మరోవైపు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ జంట పెళ్లి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.