
Arunachalam : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో ఇటీవల ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన మణికుమార్ అనే 36 ఏళ్ల భక్తుడు, తన కుటుంబంతో కలిసి జూలై 24న అరుణాచలం వెళ్లారు. ప్రధాన ఆలయంలో పూజలు ముగించుకున్న తర్వాత, వారు 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్షమార్గా్న్ని దర్శించుకోవడానికి వెళ్లాడు. అయితే ఈ మోక్షమార్గం గుండా బయటకు వెళితే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే మణికుమార్ మోక్షమార్గం లోకి వెళ్లి అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో ఇతరుల సహాయంతో మణికుమార్ ను బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మణికుమార్ చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పేశారు.
Also Read : షాకింగ్ రిపోర్ట్: భారతదేశంలో అత్యంత రిచెస్ట్ సీఎంలు వీరే.. నంబర్ 1 CM ఇతడే..!
ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో ఆలయ అధికారులు తీవ్రంగా స్పందించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇకపై అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, శ్వాస సంబంధిత లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఇరుకైన మోక్ష మార్గంలో ప్రవేశించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి మార్గాల్లో కొందరు భక్తులు ఇరుక్కుపోవడం, ఊపిరాడక ఇబ్బంది పడటం వంటి ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణ దర్శనాలకు ఎలాంటి ఆటంకం లేకపోయినా, మోక్షమార్గం మధ్య నుంచి సాగే ఈ సాహస ప్రవేశం వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Also Read : భారత్‌లో నిజంగానే ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అవుతోందా?.. సంచలనం రేపుతున్న వార్తపై అసలు నిజం ఇదే!









