New Delhi :  దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రికత్త నెలకొంది. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్‌తో పాటుగా మాజీ సీఎం అతిషి పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ సభలో పాల్గొన్నందుకు ఇప్పటివరకు దాదాపు 700 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : హనుమాన్ చాలీసా చదువుతూనే అందర్ని కాపాడాను.. మోదీతో స్మిత్ మచ్ఛర్‌ వీడియో కాల్!

ఈ నిరసనలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిరసనకు ముందుగా ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జంతర్ మంతర్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు.

న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా గుమికూడడం, ర్యాలీలు, ధర్నాలు, నినాదాలు, బహిరంగ సభలు నిర్వహించడంపై ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని 11 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను కూడా మూసివేశారు. జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, మండి హౌస్, న్యూ ఢిల్లీ తదితర స్టేషన్లు ఇందులో ఉన్నాయి.

జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Also Read : ప్రాణాలు పోతున్నా వెనక్కి తగ్గలేదు.. నీర్జా, స్మిత్ మచ్చర్ ఇద్దరూ హీరోలే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.