
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLతన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ఆఫర్లను, డిజిటల్ సేవలను ప్రకటించింది. దేశంలోని ప్రజలందరికీ తక్కువ ధరలోనే నమ్మకమైన, వేగవంతమైన ఇంటర్నెట్, ఫోన్ సేవలు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా రూపాయి ఫ్రీడమ్ 2.0 పేరుతో ఒక మొబైల్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. కొత్తగా BSNLసిమ్ తీసుకునేవారు కేవలం రూపాయి చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఇందులో 24 రోజుల పాటు రోజుకు 1 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు అపరిమితంగా ఉచితంగా మాట్లాడుకునే వాయిస్ కాల్స్ లభిస్తాయి.
Also Read : ఓలా, ఊబర్, రాపిడోకు బిగ్ షాక్.. ఇక ఆ ఆప్షన్ కనిపించొద్దు.. కేంద్రం సంచలన ఆదేశాలు!
దీంతో పాటు ఇంటి ఇంటర్నెట్ వాడేవారి కోసం ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్ అనే కొత్త ప్లాన్‌ను నెలకు రూ. 1,111 కే అందిస్తున్నారు. ఇందులో సెకనుకు 200 ఎంబి వేగంతో నెలకు ఏకంగా 5,000 జిబి డేటా వస్తుంది. అంతేకాకుండా సినిమా ప్రియుల కోసం 25 కంటే ఎక్కువ ప్రముఖ ఓటిటి యాప్‌లను ఉచితంగా చూసే సదుపాయం కూడా కల్పించారు.
మొబైల్ ఫోన్ వాడే కస్టమర్లకు వినోదం అందించడం కోసం BSNLసెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఉచితంగా టీవీ ఛానెళ్లు, సినిమాలు చూసే సేవలను ప్రారంభించారు. దీనికోసం ఎలాంటి అదనపు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండానే లైవ్ టీవీ చూడవచ్చు. మరోవైపు సాధారణంగా సిగ్నల్స్ అందని కొండ ప్రాంతాలు, అడవులు, మారుమూల ఊళ్లలో కూడా సజావుగా మాట్లాడుకోవడానికి శాటిలైట్ ద్వారా పనిచేసే ఫోన్ సేవలను కూడా BSNLఅందుబాటులోకి తెచ్చింది.
ప్రతీ ఒక్కరికీ తక్కువ ఖర్చులోనే సేవలు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని BSNLస్పష్టం చేసింది. ఎలాంటి తీవ్రమైన వాతావరణంలోనైనా, కష్టమైన ప్రాంతాల్లోనైనా దేశ ప్రజలకు అంతరాయం లేని కనెక్టివిటీ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పింది. భారత డిజిటల్ భవిష్యత్తుకు తమ వంతు సహకారం అందిస్తూ, ప్రజలందరినీ ఇంటర్నెట్ ద్వారా ఒక్కటి చేస్తామని సంస్థ వెల్లడించింది.
Also Read : IRCTC 45 పైసలతో లక్షల బీమా.. క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా?









