RAVI PRAKASH

Arunachal Pradesh : అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడి వాయిస్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలు అతడు ఎందుకు ఇండియా వదిలి వెళ్లిపోతున్నాడు? అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమిస్తోందని ఆరోపిస్తున్నాడు. ఏదో ఒకరోజు భారత మ్యాప్‌ నుంచి అరుణాచల ప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి రావచ్చని కూడా అంటున్నాడు. మరి ఆ కుర్రాడి వాదనలో నిజమెంత? అది వెరిఫై చేయాల్సిన విషయం. ఇదే విషయమై మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్‌.కే. సింగ్‌. ఆయన లైన్ ఆఫ్ యాక్చువల్‌ కంట్రోల్‌లో భారత్‌ పెట్రోలింగ్ పొజిషన్స్‌పై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. 2014 నుంచి భారత్‌ ఎన్ని పెట్రోలింగ్ పాయింట్స్‌ను వదులుకుంది? అని ప్రధాని, రక్షణ మంత్రిని ఆర్కే సింగ్ ప్రశ్నించారు. భారత్‌ ఒక పెట్రోలింగ్ పాయింట్‌ను వదులుకుంటే ఆ తర్వాత చైనా అక్కడికి వస్తే దాని ప్రభావం మన టెరిటోరియల్ క్లెయిమ్స్‌పై పడొచ్చని ఆర్కేసింగ్ అంటున్నారు. అయితే ఆర్కేసింగ్‌వి కూడా ఆరోపణలే. వీటిని పూర్తిగా వెరిఫై చేయాల్సి ఉంది. మరోవైపు అరుణాచల్‌లో చైనా “స్లో ఎన్‌క్రోచ్‌మెంట్” చేస్తోందన్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అందుకే ఇప్పుడు ఈ కాంట్రోవర్సీలో నాణేనికి రెండువైపులా ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ఆర్‌.కే. సింగ్‌ వాదనేంటో క్లియర్‌గా తెలుసుకుందాం. 2014 నుంచి భారత్‌ ఎన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఆపేసిందో ఆర్‌.కే. సింగ్‌ ఎందుకు ప్రశ్నించారు? దాని వల్ల భారత్‌ టెరిటోరియల్ క్లెయిమ్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఆర్కేసింగ్‌ చెబుతున్నారు? ముందుగా ఆర్‌.కే. సింగ్‌ ఏం చెప్పారో విందాం. ఇప్పుడు ఆర్‌.కే. సింగ్‌ చేసిన ఆరోపణలు ఏంటి? వాటిపై భారత ప్రభుత్వం సమాధానం ఏంటి? ఈ రెండు సైడ్స్‌నూ ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం.

Also Read : జనగణన-2027తో పాటే సమగ్ర కుల గణన… కేంద్రం కీలక ప్రకటన

అసలు ఆర్‌.కే. సింగ్‌ ఏం ఆరోపిస్తున్నారు? ఆర్కేసింగ్‌ చెప్పే విషయం అర్థం కావాలంటే ముందుగా భారత్‌-చైనా సరిహద్దు గురించి ఒక బేసిక్ విషయం తెలుసుకోవాలి. భారత్‌,-చైనా మధ్య సరిహద్దు ఇంకా పూర్తిగా డిమార్కేట్ కాలేదు. అంటే… సరిహద్దు ఎక్కడ ఉండాలనే విషయంలో రెండు దేశాల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెక్‌మోహన్ లైన్‌ను సరిహద్దుగా చైనా అంగీకరించదు. అంతేకాదు… అరుణాచల్‌ ప్రదేశ్‌ను “సదరన్ టిబెట్”లో భాగమని చైనా క్లెయిమ్ చేస్తోంది. కానీ భారత్‌ మాత్రం తమ దేశంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. అందుకే ఎల్‌ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వెంబడి పెట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆర్‌.కే. సింగ్‌ చెప్పేది ఏంటంటే భారత్‌, చైనా సైనికులు తమ తమ దేశాలు సరిహద్దుగా భావించే ప్రాంతాల వరకు పెట్రోలింగ్ చేస్తుంటారు. ఈ పెట్రోలింగ్ పాయింట్స్ అంటే జస్ట్ కొన్ని లొకేషన్స్ కాదు. వాటికి ఒక పర్పస్ ఉంది. తమకు సరిహద్దు ఎక్కడ వరకు ఉందని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో తమ ప్రెజెన్స్‌ను చూపించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందుకే… భారత్‌ ఒక పెట్రోలింగ్ పాయింట్‌కి వెళ్లడం ఆపేస్తే అది కేవలం ఒక ప్రాంతానికి వెళ్లడం ఆపేయడం మాత్రమే కాదని ఆర్‌.కే. సింగ్‌ అంటున్నారు. దాంతో భవిష్యత్తులో ఆ ప్రాంతం భారత్‌దే అని చెప్పడం కష్టమవుతుందని ఆర్కేసింగ్ అంటున్నారు.

భారత్‌ గతంలో ఒక ప్రాంతం వరకు రెగ్యులర్‌గా పెట్రోలింగ్ చేసి తర్వాత ఆపేసింది. అదే సమయంలో చైనా సైన్యం అక్కడికి వచ్చి తన ప్రెజెన్స్‌ను పెంచుకుంటే ఆ ప్రాంతంలో గ్రౌండ్ రియాలిటీ క్రమంగా మారే అవకాశం ఉందని ఆర్‌.కే. సింగ్‌ అంటున్నారు. ఇదే విషయాన్ని ఆర్కేసింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో తక్సింగ్ సమీపంలోని షెరా 5 ఉదాహరణగా చెబుతున్నారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పంపిన ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ ప్రకారం షెరా 5 పెట్రోలింగ్ పాయింట్ దగ్గర చైనా పీఎల్‌ఏ సిబ్బంది వచ్చి అక్కడి ప్రాంతాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారని ఆరోపించింది. అక్కడికి భారత సైన్యం వెళ్లకుండా చైనా అడ్డుకుంటోందని కూడా ఆ టీమ్ చెబుతోంది. అంతేకాదు… ఎల్‌ఏసీ దగ్గర స్థానికులు వెళ్లే గ్రేజింగ్, హంటింగ్ ఏరియాస్‌లోకి కూడా చైనా బలగాలు క్రమంగా తమ కంట్రోల్‌ను పెంచుకుంటున్నాయని ఆ ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ ఆరోపించింది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆ ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ చేసిన క్లెయిమ్స్ మాత్రమే. ఇవి ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరోవైపు… అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా “స్లో ఎన్‌క్రోచ్‌మెంట్” చేస్తోందన్న బ్రాడర్ అలెగేషన్‌ను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ ప్రస్తావించిన రిపోర్ట్స్ ప్రకారం 2023లో షెరా 5 దగ్గర భారత, చైనా సైనికుల మధ్య ఫిజికల్ కాన్ఫ్రంటేషన్ జరిగింది. ఆ తర్వాత భారత బలగాలు అక్కడి నుంచి వెనక్కి తగ్గాయని చెబుతున్నారు. ఫైనల్‌గా మళ్లీ భారత బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లలేదన్నది ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ చెబుతోంది. చైనా పీఎల్‌ఏ సిబ్బంది అక్కడికి వచ్చి మిగిలి ఉన్న భారత మార్కర్స్‌ను కూడా తొలగించారని ఆరోపిస్తోంది. ఒకవేళ ఇదంతా నిజమే అయితే ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ వస్తుంది. ఆర్‌.కే. సింగ్‌ అసలు అడుగుతున్నది కూడా ఇదే. భారత సైన్యం గతంలో అక్కడ పెట్రోలింగ్ చేసేది… ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? అంతేకాదు. 2014 నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైన పెట్రోలింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఇదే విషయంపై ప్రధాని, రక్షణ మంత్రిని ఆర్కేసింగ్ నేరుగా ప్రశ్నిస్తున్నారు. షెరా 5 ఒక్కటే ఐసోలేటెడ్ కేసా? లేక… గతంలో భారత సైన్యం పెట్రోలింగ్ చేసి, వెళ్లడం ఆపేసిన ప్రాంతాలు మరిన్ని ఉన్నాయా? దేశానికి ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉందని ఆర్కేసింగ్‌ అంటున్నారు. ఇక్కడే మరో ఇంపార్టెంట్ ఇష్యూ వస్తుంది. ఇది కేవలం రెండు పొలిటికల్ నరేటివ్స్ మధ్య జరుగుతున్న గొడవ కాదు. ఒకవైపు అలిగేషన్స్ వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం వాటిని పూర్తిగా రిజెక్ట్ చేస్తోంది. మరి ఇంతకీ ప్రభుత్వం ఏం చెబుతోంది? ఇప్పుడు ఆ సైడ్ కూడా చూద్దాం.

ఇప్పుడు ఈ వివాదంలో మరో సైడ్ కూడా చూద్దాం. ఆర్‌.కే. సింగ్‌, అరుణాచల్‌ ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ చేసిన ఆరోపణలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. కానీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా “స్లో ఎన్‌క్రోచ్‌మెంట్” చేస్తోందన్న ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. చైనా నెమ్మదిగా భారత భూభాగంలోకి వస్తోందన్నది నిజం కాదని గవర్నమెంట్ మాత్రం స్పష్టంగా చెబుతోంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా చెబుతోంది. చైనా చాలా కాలంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ “సౌత్ టిబెట్” అంటూ వాదిస్తోంది. ప్రభుత్వం ప్రకారం 1960లో జరిగిన భారత్‌-చైనా సరిహద్దు చర్చల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సుమారు 69 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని చైనా వాదించింది. అంటే… ఇది ఇప్పుడే మొదలైన ఇష్యూ కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1959లో చైనా బలగాలు లాంగ్జులోని అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత ప్రభుత్వం చెబుతోంది. అక్కడ చైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నట్లు వార్తలు రావడంతో ఆ ప్రాంతం తరచూ వార్తల్లోకి వస్తోంది. ఆ తర్వాత 1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగింది. ఆ సమయంలో కామెంగ్, సుబన్‌సిరి, సియోమ్, సియాంగ్, లోహిత్ ప్రాంతాల్లో చైనా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే సీజ్‌ఫైర్ తర్వాత చైనా సైన్యం భారత్‌ ఎల్‌ఏసీగా భావించే ప్రాంతానికి ఉత్తరంగా వెనక్కి వెళ్లింది.

Also Read : ఓలా, ఊబర్, రాపిడోకు బిగ్ షాక్.. ఇక ఆ ఆప్షన్ కనిపించొద్దు.. కేంద్రం సంచలన ఆదేశాలు!

ప్రభుత్వం చెబుతున్న మరో విషయం ఏంటంటే అరుణాచల్‌ ప్రదేశ్‌కు టిబెట్‌ వైపు గ్రేట్ హిమాలయన్ రేంజ్ వెంట చాలా పొడవైన, డిఫికల్ట్ బోర్డర్ ఉంది. ఇటీవల సంవత్సరాల్లో భారత్‌ ఈ ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారీగా పెంచింది. దీంతో బోర్డర్‌పై పెట్రోలింగ్, సర్వైలెన్స్ మరింత పెరిగాయని గవర్నమెంట్ చెబుతోంది. అయితే సరిహద్దు ఇంకా పూర్తిగా డిమార్కేట్ కాలేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో భారత, చైనా పెట్రోల్స్ ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్స్, మెకానిజమ్స్ ప్రకారం పరిస్థితిని హ్యాండిల్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. బోర్డర్‌ను మానిటర్ చేయడానికి చైనా యాక్టివిటీని గమనించడానికి అవసరమైతే రెస్పాండ్ చేయడానికి ఆర్మీ, ఐటీబీపీ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఎలాంటి స్పెసిఫిక్ ఎవిడెన్స్ లేకుండా చైనా ఎన్‌క్రోచ్‌మెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేయడం కేవలం అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలని ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు మన ముందు రెండు డిఫరెంట్ నరేటివ్స్ ఉన్నాయి. ఒకవైపు… ఆర్‌.కే. సింగ్‌ అడుగుతున్న ప్రశ్న: 2014 నుంచి భారత్‌ ఎన్ని పెట్రోలింగ్ పాయింట్స్‌ను వదులుకుంది? మరోవైపు అరుణాచల్‌లో చైనా స్లో ఎన్‌క్రోచ్‌మెంట్ చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇందులో ఎవరి వాదన నిజం? ఇక్కడే మనం పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌ను దాటి ఫ్యాక్ట్స్‌ను చూడాలి. ఎందుకంటే ఈ మొత్తం కాంట్రోవర్సీలో ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఇప్పుడు సెంటర్‌గా మారింది. షెరా 5. ఇక్కడి నుంచే అసలు క్వశ్చన్స్ మొదలవుతున్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనా నెమ్మదిగా చొచ్చుకొస్తోందన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తోంది. మరి షెరా 5 దగ్గర అసలు ఏం జరిగింది? అది భారత్‌ పెట్రోలింగ్ పాయింటా? 2023లో అక్కడ భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందా? ఆ తర్వాత భారత బలగాలు అక్కడి నుంచి వెనక్కి వచ్చాయా? ఆ తర్వాత పీఎల్‌ఏ అక్కడికి వచ్చిందా? భారత్‌కు చెందిన మార్కర్స్‌ను తొలగించారా? అన్నింటికంటే ముఖ్యంగా… ఇప్పటికీ భారత సైన్యం అక్కడ పెట్రోలింగ్ చేస్తోందా? ఇవన్నీ పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌తో తేలిపోయే క్వశ్చన్స్ కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి. షెరా 5 ఎందుకు ఇంపార్టెంట్ అంటే… ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ చెబుతున్నది కేవలం ఒక మిలిటరీ పొజిషన్ గురించి మాత్రమే కాదు. స్థానిక ప్రజలు ఎప్పటినుంచో పశువులను మేపుకోవడానికి, వేటకు వెళ్లే ప్రాంతాల గురించి కూడా ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ ప్రస్తావించింది. స్థానికుల మూవ్‌మెంట్‌పై రెస్ట్రిక్షన్స్ పెరగడం వల్ల పీఎల్‌ఏ బలగాలు మరింత ముందుకు రావడానికి అవకాశం దొరికిందని ఆరోపించింది. అయితే చైనా క్రమంగా ముందుకు వస్తోందన్న ఈ బ్రాడర్ నరేటివ్‌ను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకే ఇప్పుడు అసలు టెస్ట్ ఒక్కటే. షెరా 5 దగ్గర గ్రౌండ్ రియాలిటీ ఏం చెబుతోంది? అంతేకాదు 2014 తర్వాత ఇలాంటి మార్పులు జరిగిన పెట్రోలింగ్ పాయింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? ఈ ప్రశ్నకు ప్రభుత్వం క్లియర్‌గా సమాధానం ఇవ్వాలి. ఆర్‌.కే. సింగ్‌ అడిగారని కాదు. ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్ చెప్పిందనీ కాదు. భారత్‌ టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి సంబంధించిన విషయం కాబట్టి ప్రజలకు క్లియర్ ఆన్సర్స్ తెలియాలి.

అయితే ఈ టాపిక్‌లోనే మరో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అని అంటోంది. ఇది కేవలం పాత మాట కాదు. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ను “జాంగ్నాన్” లేదా “సౌతర్న్ టిబెట్” అని పిలుస్తోంది. భారత్‌ పెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పేరును చైనా యాక్సెప్ట్ చేయలేదు. అంతేకాదు 2017 నుంచి ఈ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలకు చైనా తనదైన పేర్లు పెడుతోంది. చైనా అధికారులు ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకు ఆరు దశల్లో 112 ప్రదేశాలకు ఇలాంటి పేర్లు ప్రకటించారు. తాజాగా 2026 ఏప్రిల్‌లో కూడా కొన్ని పేర్లు ప్రకటించారు. కాబట్టి మొత్తం పిక్చర్‌ను అర్థం చేసుకోవాలి. అరుణాచల్‌ తమదేనని చైనా అంటోంది. భారత్‌ దాన్ని అంగీకరించడం లేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదు. ఎల్‌ఏసీ విషయంలో రెండు దేశాలకు తమ తమ అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ప్రతి పెట్రోలింగ్ పాయింట్ ముఖ్యం. ప్రతి ఇండియన్ పెట్రోల్ ముఖ్యం. అక్కడ ఉన్న ప్రతి మార్కర్ కూడా ముఖ్యం. అలాగే రోడ్స్, బ్రిడ్జెస్, మిలిటరీ పోస్ట్స్, సర్వైలెన్స్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్.

ఒక వైరల్ వీడియో కనిపించినంత మాత్రాన చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించిందని చెప్పలేం. అలాగే ఆర్‌.కే. సింగ్‌ చేసిన అలెగేషన్ కూడా ఒక్కటే ప్రూఫ్ కాదు. ఫ్యాక్ట్-ఫైండింగ్ రిపోర్ట్ అంటే అఫీషియల్ మిలిటరీ రిపోర్ట్ అని కూడా కాదు. అదే విధంగా ప్రభుత్వం ఖండించిందని ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగిపోదు. మనం అడగాల్సింది ఎవిడెన్స్. షెరా 5 దగ్గర అసలు ఏం జరిగింది? 2023కి ముందు భారత సైన్యం ఎక్కడి వరకు పెట్రోలింగ్ చేసేది? ఆ పెట్రోలింగ్ ఎప్పుడు ఆగిపోయింది? ఇప్పటికీ భారత సైన్యం అక్కడికి వెళ్లగలుగుతోందా? అక్కడ ఉన్న భారత గుర్తులకు ఏమైంది? అన్నింటికంటే ముఖ్యంగా 2014 నుంచి భారత్‌ ఎన్ని పెట్రోలింగ్ పాయింట్స్‌ను వదులుకుంది? ఇదే ప్రశ్నను ఆర్‌.కే. సింగ్‌ ప్రభుత్వం ముందు పెట్టారు. దీనికి గవర్నమెంట్ నుంచి క్లియర్ ఆన్సర్ రావాలి. జర్నలిస్ట్ ఆర్తి టికూ కూడా దీనివల్ల భారత్‌కు భద్రతాపరంగా ఎదురయ్యే సమస్యల గురించి చెప్పారు. భారత్‌కు “360-డిగ్రీ” ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్తి అభిప్రాయపడ్డారు. ఆమె అనాలసిస్‌తో మనం ఏకీభవించినా, లేక విభేదించినా భారత్‌ చుట్టూ సెక్యూరిటీ సిచువేషన్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉందన్నది మాత్రం వాస్తవం. అందుకే అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశాన్ని కేవలం పొలిటికల్ షౌటింగ్ మ్యాచ్‌గా మార్చకూడదు. ఇప్పుడు మనం భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది అని మాత్రమే చెప్పకూడదు. అలాగే ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తున్న ఆరోపణలని కూడా కొట్టిపారేయకూడదు. నిజం ఏంటో గ్రౌండ్‌లో ఉన్న ఎవిడెన్స్ చెప్పాలి. శాటిలైట్ ఇమేజెస్, పెట్రోల్ రికార్డ్స్, మిలిటరీ రిపోర్ట్స్, మ్యాప్స్, కోఆర్డినేట్స్ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది బీజేపీ వర్సెస్ అపోజిషన్ కాదు. ఇది ఆర్‌.కే. సింగ్‌ వర్సెస్ మోదీ ప్రభుత్వం కూడా కాదు. సోషల్ మీడియాలో మరో పొలిటికల్ వార్‌గా కూడా దీనిని మార్చకూడదు. ఇది భారత్‌ క్లెయిమ్ చేసే సరిహద్దు గురించి. ఇది ఎల్‌ఏసీ గురించి. అంతిమంగా ఇది భారత్‌ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ గురించి. ఇది భారత్‌ సరిహద్దు గురించి. ఇది ఎల్‌ఏసీ గురించి. అంతిమంగా ఇది భారత్‌ భద్రత, భూభాగం గురించి.

అందుకే చివరగాఈ మొత్తం స్టోరీలో ముఖ్యమైన క్వశ్చన్ దగ్గరకు మళ్లీ వద్దాం. 2014 నుంచి భారత్‌ ఎన్ని పెట్రోలింగ్ పాయింట్స్‌ను వదులుకుంది? ఒక్కటి కూడా వదులుకోలేదంటే అదే విషయాన్ని గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పాలి. పెట్రోలింగ్‌లో మార్పులు అగ్రిమెంట్స్, ప్రోటోకాల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషనల్ రీజన్స్ వల్ల జరిగితే అది కూడా దేశ ప్రజలందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. షెరా 5పై వస్తున్న ఆరోపణలు తప్పు అయితే దానికి ఆధారాలు చూపించాలి. ఎందుకంటే ఒక అరుణాచల్ కుర్రాడు సోషల్ మీడియాలోకి వచ్చి “ఐ యామ్ సేయింగ్ గుడ్‌బై టు ఇండియా” అని చెబుతున్నప్పుడు… ఆ భావోద్వేగాన్ని ఈజీగా ఇగ్నోర్ చేయలేం. అలాగే ఫియర్, మిస్‌ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేషనల్ డిబేట్ జరగడానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. సమాధానం ఒక్కటే. ఫ్యాక్ట్స్. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఆర్మీ కూడా చెప్పగలిగిన విషయాలను క్లియర్ చేయాలి. ఇండిపెండెంట్ ఎవిడెన్స్ ద్వారా గ్రౌండ్‌లో అసలు ఏం జరుగుతుందో బయటకు రావాలి. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ కేవలం మ్యాప్‌పై ఉన్న ఒక లైన్ కాదు. అది భారత భూభాగం. మనకు చెందిన ప్రాంతంలోకి మరో దేశం రావడం వల్ల భారత్‌ యాక్సెస్ తగ్గుతోందన్న ఆరోపణలు వస్తే దానిపై సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. పొలిటికల్‌గా డిస్మిస్ చేయడం కాదు. అదే అసలు విషయం. ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఇవే. షెరా 5 దగ్గర అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి పెట్రోలింగ్ పాయింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా అరుణాచల్‌లో గ్రౌండ్ రియాలిటీ నిజంగానే మారుతోందా? మనకు ఆన్సర్స్ కావాలి. స్లోగన్స్ కాదు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.