
Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో వారికి విచిత్రమైన వస్తువులు దొరికాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడిని బ్యా్గ్ను తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అందులో మానవ రూపాన్ని పోలిన జంతువు పుర్రె లభించడం కలకలం రేపింది. దీంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అది ‘కోతి పుర్రె’ అని సదరు ప్రయాణికుడు వెల్లడించాడు. అంతేకాదు ఆ పుర్రెతో పాటు మంత్రదండం లాంటి వస్తువు కూడా అతని వద్ద లభించింది.
𝗔𝗹𝗲𝗿𝘁 𝗘𝘆𝗲𝘀, 𝗦𝘁𝗿𝗼𝗻𝗴 𝗦𝗲𝗰𝘂𝗿𝗶𝘁𝘆: 𝗖𝗜𝗦𝗙 𝗗𝗲𝘁𝗲𝗰𝘁𝘀 𝗮 𝗦𝗸𝘂𝗹𝗹 𝗮𝘁 𝗗𝗲𝗹𝗵𝗶 𝗔𝗶𝗿𝗽𝗼𝗿𝘁
CISF personnel at Delhi Airport, during security screening, detected a skull in the hand baggage of a passenger travelling from Delhi to Hyderabad.
During… pic.twitter.com/pq5q3ciI5Z
— APS – CISF (@CISFAirport) August 12, 2026
సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కేందుకు ఆ ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌ను ఎక్స్-రే మిషన్ ద్వారా తనిఖీ చేశారు, ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బ్యాగ్‌ను తెరిచి సోదా చేశారు. అందులో ఒక పుర్రె బయటపడింది. అయితే భద్రతా సిబ్బంది ఆ పుర్రె గురించి ప్రయాణికుడిని ప్రశ్నించారు. అది కోతికి చెందిందని ప్రయాణికుడు సమాధానం ఇచ్చాడు. అయితే విమానంలో ఇలాంటి వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం అని చెప్పినఅధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
CISF Detects Skull Concealed in Passenger’s Hand Baggage at IGI Airport, New Delhi
Alert CISF personnel deployed at IGI Airport, New Delhi, detected a skull concealed inside the hand baggage of a passenger during the Pre-Embarkation Security Check.
The passenger was scheduled… pic.twitter.com/BpC009joNq
— CISF (@CISFHQrs) August 12, 2026
మరోవైపు అతన్ని విచారించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అనంతరం అతన్ని స్థానిక ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న పుర్రెను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపిన పోలీసులు ఈ వ్యవహారం వన్యప్రాణులకు సంబంధించినది కావడంతో ‘వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972’ (వన్యప్రాణి సంరక్షణ చట్టం) నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ పుర్రెను ఆ ప్రయాణికుడు ఢిల్లీలో ఎక్కడి నుంచి సంపాదించాడు? దాన్ని హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్తున్నాడు? దీని వెనుక ఏవైనా చేతబడులు, మూఢనమ్మకాలు వంటి కారణాలు ఉన్నాయా? లేక అక్రమ రవాణా కోణాలు ఉన్నాయా? అనే విషయాలపై పోలీసులు, సంబంధిత అటవీ శాఖ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.









