
Abhijeet Dipke : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున మా గొంతును అణచివేసేందుకు కుట్ర జరిగిందని ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు పనిచేయలేదు. దీంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఈ రోజు (శనివారం) ఉదయం 6.16 గంటలకు తొలగించినట్లు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం తిరిగి 6.45 గంటలకు ఖాతాను పునరుద్ధరించారని మరో పోస్టు పెట్టారు. ఇది కావాలనే చేసిన చర్యగా ఆయన ఆరోపించారు. తమను అడ్గుకోవడానికి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంచుకోవడం సిగ్గుచేటని దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, దేశ ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా జాతిని ఉద్ధేశించి ప్రసంగించడానికి ముందు సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్లోజ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : 1947లో మీరు రూ. 1,000 విలువైన బంగారం కొనుగోలు చేసి ఉంటే, నేడు దాని విలువ ఎంతో తెలుసా?
‘స్కూల్ ఠీక్ కరో’తో మరో పోరాటం
ఇక సీజేపీ ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు భాగలేవని, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల తీరు మాత్రం మారటం లేదని ఆయన ఆరోపించారు. అందుకోసమే మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని తన సొంత గ్రామమైన సంతుక్ పింప్రీ నుంచి ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు, గ్రామస్థులు, సర్పంచ్‌లు సామాజిక తనిఖీలు చేసి నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భారీ ప్రచార బ్యానర్ల కోసం ఖర్చు చేసే డబ్బును గ్రామీణ పాఠశాలలు, విద్యార్థుల కోసం ఖర్చు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం తాము బృందాలను ఏర్పాటు చేశామని, వారు గ్రామాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తారని దీప్కే తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా గ్రామీణ విద్యార్థులు తమ పాఠశాలల్లో కనీస సౌకర్యాల కోసం ఇంకా ఎదురుచూసే పరిస్థితి రావడం సిగ్గుచేటని దీప్కే విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లను బాగుచేసేందుకోసమే ఈ ఉద్యమాన్ని ఎంచుకున్నామని ఆయన తెలిపారు.
Also Read : యువతకు మోదీ గుడ్ న్యూస్.. AI ఉచిత కోచింగ్, ఎగ్జామ్స్‌కు ఫ్రీ కోచింగ్!









