Cockroach Janta Party : దేశవ్యాప్తంగా ఇప్పుడు కాక్ రోచ్‌ జనతా పార్టీ పేరు బలంగా వినిపిస్తోంది. సోషల్‌ మీడియా పోస్టుతో మొదలైన ఈ ఉద్యమం.. కొద్ది రోజుల్లోనే వేలాది మంది యువతను ఒక్కచోటికి తీసుకొచ్చింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా 36 రోజుల పాటు సాగిన ఆందోళన.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే స్థాయికి వెళ్లింది. మరి ఇంతటి ఉద్యమాన్ని నడిపించింది ఎవరు కాక్‌రోచ్‌ జనతా పార్టీ వెనుక ఉన్న ఆ 12 మంది ఎవరు వారి చదువులు, ఉద్యోగాలు ఏంటి అసలు ఈ సంస్థ ఎలా పుట్టింది అనేది ఇప్పుడ చూద్దాం.

కాక్ రోచ్‌ జనతా పార్టీకి ఫౌండర్‌గా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన అభిజీత్‌ దీప్కే ఉన్నారు. జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ చదివిన ఆయన బోస్టన్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. ఆయనతో పాటు IIT కాన్పూర్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ చదివిన ఆశుతోష్‌ రంకా, జర్నలిజం చదివిన సౌరవ్‌ దాస్‌ కో-కన్వీనర్లుగా ఉన్నారు.

Also Read : బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. ఏం చేస్తుందంటే?

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 30 ఏళ్ల ఆశుతోష్‌ రంకా కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆయన ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల సౌరవ్‌ దాస్‌ కూడా కో-కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ చదివారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 35 ఏళ్ల అజింక్య షిండే జాతీయ సంస్థాగత ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఆయన మహారాష్ట్రలోని లోనేరే, రాయ్‌గఢ్‌లో ఉన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ చేశారు.

ఇటీవల ప్రకటించిన 12 మంది టీమ్‌లో ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన విజయ్‌ రెడ్డి మల్లంగి మీడియా లీడ్‌, సౌత్‌ జోన్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా, CJP ఏర్పడిన తీరు కూడా ఆసక్తికరమే. 2026 మేలో ఒక సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా యువతపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభిజీత్‌ దీప్కే సోషల్‌ మీడియాలో ఒక వ్యంగ్య పోస్టు పెట్టారు. అదే తర్వాత CJPగా రూపుదిద్దుకుంది. ఆన్‌లైన్‌ ఉద్యమం క్రమంగా ప్రత్యక్ష ఆందోళనగా మారి జంతర్‌ మంతర్‌ వరకు చేరింది. అయితే ఇప్పటికైతే రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని CJP స్పష్టం చేసింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : జేబులో రూపాయి లేకుండానే బిజినెస్.. గవర్నమెంట్ పోర్టల్‌తో క్షణాల్లో లోన్.. ఎలాగంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.