
Fortune Oil : నాణ్యతా ప్రమాణాలు పాటించని,బలవర్ధకమైన(ఫోర్టిఫైడ్)సన్‌ఫ్లవర్ వంట నూనెను ఉత్పత్తి చేసి విక్రయించినందుకు గాను, ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ సంస్థ AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌పై ఆహార నియంత్రణ సంస్థ FSSAI జరిమానా విధించింది.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ ‘ఫార్చ్యూన్’ బ్రాండ్ పేరుతో వంట నూనెలను విక్రయిస్తోంది.గోవాలో సేకరించిన నమూనా ల్యాబ్ పరీక్షల్లో విఫలమవ్వడంతో, అందులో విటమిన్ డి స్థాయిలు నిర్దేశిత పరిమితుల కంటే చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.దీంతో FSSAI చర్యలకు ఉపక్రమించింది.
Also Read : పాక్ దొంగ బుద్ధి.. భారత్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ కు వలపు వల.. మహిళతో వీడియో కాల్స్ చేయించి.. !
FSSAI సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, ఒక తీర్పును వెలువరించామని, AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌పై జరిమానా విధించినట్లు సమాచారాన్ని వెల్లడించింది.”AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ (మంగళూరు) సంస్థ నాణ్యతా ప్రమాణాలు లేని, ఫోర్టిఫైడ్ వంట నూనెను (ఫార్చ్యూన్ ‘ఫ్రయోలా’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్) ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విక్రయించినందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి” అని FSSAI తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ… గోవాలోని తాజ్ ఫోర్ట్ అగువాడ రిసార్ట్ & స్పా నుండి FSSAI అధికారులు ఒక లీటర్ ఫార్చ్యూన్ ‘ఫ్రయోలా’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ నమూనాను సేకరించినట్లు తెలిపారు.ఈ ఫోర్టిఫైడ్ వంట నూనె ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్) రెగ్యులేషన్స్, 2018’ కింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రాథమిక ఆహార ప్రయోగశాల నివేదించింది.
ఈ వంట నూనెలో”విటమిన్ ఎ, విటమిన్ డి స్థాయిలు నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగా ఉన్నాయి, తద్వారా 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, సెక్షన్ 3(1)(zx) ప్రకారం ఈ ఉత్పత్తి నాణ్యత లేనిదిగా ప్రకటించబడింది” అని నియంత్రణ సంస్థ పేర్కొంది.కంపెనీ అప్పీల్ మేరకు, ఆ నమూనాను రెఫరల్ ల్యాబొరేటరీలో విశ్లేషించగా, విటమిన్ డి మోతాదు నిర్దేశిత పరిధి కంటే చాలా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించబడింది.అనంతరం, సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ (అధికారి) ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేయగా, తీర్పు కోసం దరఖాస్తును దాఖలు చేశారు.
“గోవా న్యాయాధికారి తీర్పును వెలువరిస్తూ, 2006 నాటి FSS చట్ట నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు లేని ఫోర్టిఫైడ్ వంట నూనెను ఉత్పత్తి చేసి విక్రయించినందుకు AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్‌పై జరిమానా విధించారు” అని నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే జరిమానా మొత్తాన్ని FSSAI వెల్లడించలేదు.గత కొన్ని నెలలుగా, FSSAI తన చట్టాలు ,నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (FBOలు), ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.
Also Read : కన్వర్ యాత్రకు చెడ్డపేరు తెచ్చేదెవరు ?









