
గుజరాత్‌లో ఇటీవల భారీ వర్షాలు సృష్టించిన వర్ష బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం 14 గంటల్లోనే పలు ప్రాంతాల్లో 400 నుంచి 450 మిల్లీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. చిఖ్లిలో 451 మి.మీ, ధోల్కాలో 440 మి.మీ వర్షం కురిసి నదులు, రోడ్లు, గ్రామాలు జలమయమయ్యాయి. కొద్ది నెలల క్రితం వరకు ఎల్ నినో వల్ల కరువు వస్తుందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా గుజరాత్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎల్ నినో ముప్పును అణచివేసి.. ఈ స్థాయి భారీ వర్షాలకు కారణమైన అసలైన శక్తి పసిఫిక్ దశాబ్దపు డోలనం( PDO).
Also Read : ఈ రాశుల వారు నేడు చాలా అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే కష్టమే!
Extreme torrential downpours struck Vapi in southern Gujarat, dumping nearly nine inches of rain that engulfed cars and washed livestock away in surging currents. The sudden deluge has caused widespread flooding throughout several areas of Valsad district. pic.twitter.com/6GZYIMHRcj
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 23, 2026
Also Read : టీవీ న్యూస్ ఛానెల్స్‌పై దాడులు ఎందుకు?
PDO అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వచ్చే ఒక దీర్ఘకాలిక మార్పులు. ఎల్ నినో (ENSO) ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి మారిపోతే, PDO మాత్రం ఒక్కో దశలో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రస్తుతం PDO అత్యంత బలమైన ప్రతికూల దశలో (-1.3 నుండి -1.6 సూచిక విలువలతో) కొనసాగుతోంది. ఈ ప్రతికూల దశలో ఉన్నప్పుడు ఈశాన్య పసిఫిక్ సముద్ర తీరం చల్లగా, మధ్య పసిఫిక్ ప్రాంతం వెచ్చగా ఉంటుంది.
PDO ప్రతికూల దశలో ఉన్నప్పుడు భారత వేసవి రుతుపవనాలు ఊహించని స్థాయిలో బలపడతాయి. పశ్చిమ పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి భారీగా తేమను ఆకర్షించే రుతుపవన ద్రోణి ఏర్పడుతుంది. దీనివల్ల సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ ప్రతికూల PDO శక్తివంతంగా మారింది. అది ఎల్‌నినో చూపించే పొడి వాతావరణ ప్రభావాన్ని పూర్తిగా తొక్కేసి.. అరేబియా సముద్రం నుంచి గుజరాత్ వైపు నిరంతరం తేమగాలులు వచ్చేలా చేసింది.
శాస్త్రవేత్తలు PDOని సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వాతావరణ అంచనా నమూనాలు ప్రధానంగా కొద్ది నెలల కాల వ్యవధి ఉండే ఎల్ నినోపైనే దృష్టి సారిస్తాయి. దశాబ్దాల పాటు ఉండే PDO సంక్లిష్టతను ఇవి సరిగ్గా అంచనా వేయలేవు. దీనికి తోడు భూతాపం పెరగడం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మారి, PDO ప్రతికూల దశ మరింత తీవ్రంగా మారుతోంది. వాతావరణ నమూనాలు ఈ మార్పులను పూర్తిగా పసిగట్టలేకపోతున్నాయి.
భౌగోళికంగా పర్వత ప్రాంతాలు, సముద్ర తీరానికి సమీపంలో ఉండటం వల్ల గుజరాత్‌లోని నవసారి, సూరత్, వల్సాద్ వంటి జిల్లాలు భారీ వర్షాలకు అనుకూలంగా మారాయి. PDO ప్రభావంతో రుతుపవన ద్రోణి దక్షిణం వైపుకు జరగడంతో ఈ విధ్వంసం జరిగింది. భవిష్యత్తులో వాతావరణ అంచనాలు కేవలం ఎల్ నినోపైనే కాకుండా PDO, ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) వంటి దీర్ఘకాలిక సముద్ర వ్యవస్థలపై ఆధారపడి రూపొందించాలి. PDO ప్రతికూల దశలోనే కొనసాగితే.. రాబోయే కొన్నేళ్లపాటు భారతదేశంలో ఇటువంటి అసాధారణ భారీ వర్షాలు, వరదలు మరిన్ని చూసే అవకాశం ఉంది.









