agra

Agra :  ఆగ్రాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్యను అనుమానించిన ఒక భర్త, ఆమెను ఒక గెస్ట్ హౌస్‌లో మరొక వ్యక్తితో ఉండగా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నివాసముంటున్న ఒక వ్యక్తి వెండి వ్యాపారి. తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అతనికి అనుమానం కలిగింది. ఆమె కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం భార్య తన కూతురు పని నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ, ఆమె నేరుగా ఒక గెస్ట్ హౌస్‌కు వెళ్లడం గమనించిన భర్త, ఆమెను వెంబడించాడు. అక్కడికి వెళ్లిన భర్త, తన భార్య మరొక వ్యక్తితో కలిసి గదిలోకి వెళ్లడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Also Read : అయోధ్య CEO పోస్టుకు ఫుల్ డిమాండ్.. క్యూ కట్టిన మాజీ IAS ఆఫీసర్స్!

వెంటనే భర్త గది వద్దకు వెళ్లి వారిని నిలదీశాడు. దీంతో అక్కడ పెద్ద గొడవ మొదలైంది. వీరిద్దరి వాగ్వాదం చూసి గెస్ట్ హౌస్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ గొడవను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. గది వద్దే భర్త మాట్లాడుతూ, తన భార్య తనపై అక్రమంగా గృహహింస కేసు పెట్టిందని, తన అక్రమ సంబంధాన్ని బయటపడకుండా దాచుకునేందుకే ఇలా తప్పుడు కేసులు బనాయించిందని అందరి ముందు ఆరోపించాడు. అయితే, భర్త చేసిన ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది ఇంకా స్పష్టత లేదు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిషామాక్ త్యాగి తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు భార్యాభర్తలను పిలిచి సుమారు మూడు గంటల పాటు మాట్లాడించారు. చివరకు, ఇద్దరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, వివాదం సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు.

Also Read : అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంపు? చట్ట సవరణకు కేంద్రం సన్నద్ధం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.