
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ బులియన్ స్పాట్ మార్కెట్లోనూ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రూ.2 లక్షలు దాటి పరుగులు తీసిన వెండి ధర, తాజాగా నమోదైన భారీ పతనంతో రూ.2 లక్షల మార్కు దిగువకు పడిపోయింది.
Also Read : డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనకునే వారికి షాక్.. మారిన రూల్స్ ఇవే!
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.950 మేర తగ్గి, రూ.1,42,650 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.1,30,760 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ 4 గడువు కలిగిన 24 క్యారెట్ల బంగారం కాంట్రాక్ట్ తులం రూ.944 తగ్గి రూ.1,42,365 వద్ద ట్రేడైంది.
హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కిలో వెండిపై ఏకంగా రూ.3,980 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,96,350 వద్దకు దిగివచ్చింది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా వెండి కాంట్రాక్టు రూ.3,371 తగ్గి రూ.1,96,228 వద్ద కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన వెండి ధర మళ్లీ రూ.2 లక్షల దిగువకు చేరడం వెండి వస్తువులు, నాణాలు కొనుగోలు చేసే వారికి పెద్ద ఊరటగా మారింది.
అంతర్జాతీయ వాతావరణం, డాలర్ స్థిరత్వం, రూపాయి మారకం విలువ, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ఈ లోహాల ధరలపై ప్రభావం పడిందని నిపుణులు భావిస్తున్నారు. పండుగలు, శుభకార్యాల సీజన్ వస్తుండటంతో బంగారం, వెండి నగల కొనుగోళ్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే స్థానిక మార్కెట్ నిబంధనలు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి పన్నుల ఆధారంగా దుకాణాల్లో తుది ధరలలో కొంత వ్యత్యాసం ఉంటుందని, కాబట్టి కొనుగోలు చేసే సమయంలో తాజా మార్కెట్ వివరాలను సరి చూసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : మార్కెట్లోకి సరికొత్త సర్కాడియన్ డిప్రెషన్.. ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగంటే?









