
Driving License Rules : దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను సమూలంగా మార్చేసే ఒక బిగ్ ప్లాన్ తెరపైకి వచ్చింది. రోడ్డు భద్రతను పెంచే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త మార్పులు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు అందరికీ ఒకేలా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఇకపై విభజన రాబోతోంది. మన దేశ పౌరులకు, విదేశీయులకు మధ్య తేడాను సులభంగా గుర్తించేలా కలర్-కోడెడ్ డ్రైవింగ్ లైసెన్స్‌ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు గోప్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వస్తే రోడ్డు రవాణా రంగంలో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల బెడద, మోసపూరిత పత్రాల సమర్పణకు చెక్ పెట్టడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. విదేశీ పౌరులు మన దేశంలో డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటంలో కొన్ని లొసుగులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్స్, ఫారెనర్స్ని వేరువేరుగా గుర్తించేలా లైసెన్స్ కార్డుల రంగులను మార్చాలని యోచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీసులు లేదా అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఎవరి జాతీయత ఏమిటనేది క్షణాల్లో తెలిసిపోతుంది.
Also Read : ICICI Bank బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
అయితే ఈ కలర్-కోడింగ్ వెనుక కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా డ్రైవింగ్ టెస్ట్‌లకు సంబంధించి మరింత కఠినమైన నిబంధనలు కూడా రాబోతున్నాయి. ఇకపై లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు కచ్చితంగా 30 నిమిషాల సేఫ్టీ ట్యుటోరియల్ చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా డ్రైవింగ్ టెస్ట్‌లో పాస్ కావాలంటే కనీసం 75 శాతం మార్కులు తెచ్చుకోవాలనే కఠినమైన షరతును విధిస్తున్నారు. ఇవన్నీ ఆన్లైన్లోని ‘సారథి’ పోర్టల్ ద్వారా పకడ్బందీగా పరిశీలిస్తారు.
ఈ మార్పులన్నీ సాధారణ ప్రయాణికులకు ఒకరకంగా మేలు చేసినప్పటికీ విదేశీ ప్రయాణికులు, సరిహద్దు ప్రాంతాల్లో తిరిగే వారికి ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ లాంటిదే. లైసెన్స్ రెన్యూవల్, డూప్లైకేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు వంటి అన్ని సేవలూ ఒకే ఏకీకృత ఫారమ్ కిందకు రానున్నాయి. మరి ఈ కలర్-కోడెడ్ లైసెన్స్‌లు రోడ్డు ప్రమాదాలను ఎంతవరకు అడ్డుకుంటాయి. విదేశీయుల రాకపోకలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
Also Read : భారత్‌లో అల్లర్లకు అంతర్జాతీయంగా కుట్ర? 9 దేశాల్లో 101 నెట్‌వర్క్‌లు









