iPhone 18 :  టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్‌ కొత్త ఐఫోన్లను విడుదల చేసింది. అమెరికాలోని యాపిల్‌ పార్క్‌లో జరిగిన సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌ ఈవెంట్‌లో తొలిసారిగా ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీనికి ఐఫోన్‌ డ్యూయో అని పేరు పెట్టింది. దీంతో పాటు ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్‌ 5, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, అల్ట్రా 4లను కూడా పరిచయం చేసింది. టిమ్‌ కుక్‌ తర్వాత కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జాన్‌ టెర్నస్ ఆధ్వర్యంలో జరిగిన తొలి పెద్ద యాపిల్‌ ఈవెంట్‌ ఇదే.

యాపిల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఐఫోన్‌ డ్యూయో ఏ20 ప్రో చిప్‌తో పనిచేస్తుంది. ఫోన్‌ను తెరిస్తే 7.6 అంగుళాల స్క్రీన్ వస్తుంది. బయట 5.4 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఫోన్‌లో రెండు యాప్‌లను ఒకేసారి వాడుకునే అవకాశం కూడా ఉంది. ఐఫోన్‌ డ్యూయోలో కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని యాపిల్ చెబుతోంది. పెద్దదైన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మాత్రం 30 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి.

Also Read : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ధమాకా.. మార్కెట్‌లోకి ఐఫోన్ 18 ప్రో మోడల్స్.. నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, రేట్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 34 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇందులో కూడా 256GB నుంచి 2TB వరకు నాలుగు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త ఐఫోన్‌లలో కెమెరా కూడా పెద్ద అప్‌గ్రేడ్‌ను అందుకుంది. 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరాను తీసుకొచ్చారు. ఇందులో ఫిజికల్ వేరియబుల్ అపెర్చర్‌ ఫీచర్‌ను తొలిసారిగా ఐఫోన్‌లో అందించారు. దీంతో ఫొటోలు తీసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, ఫోకస్, తక్కువ వెలుతురులో ఫొటోలపై మరింత నియంత్రణ లభిస్తుంది. వెలుతురు, ఫొటోలో కావాల్సిన డెప్త్‌ను బట్టి అపెర్చర్‌ను ఆటోమేటిక్‌గా కూడా మార్చుకోవచ్చు. దీని కోసం మనిషి వెంట్రుక కంటే పలుచగా ఉండే లేజర్ కట్ భాగాలను ఉపయోగించినట్లు ఆపిల్ తెలిపింది.

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర రూ.1,64,900గా ఉంది. 512GB ధర రూ.1,89,900 కాగా.. 1TB వేరియంట్ రూ.2,39,900, 2TB వేరియంట్ రూ.3,14,900గా నిర్ణయించారు.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB మోడల్ రూ.2,04,900, 1TB వేరియంట్ రూ.2,54,900, 2TB వేరియంట్ రూ.3,29,900గా ఉంది. కొత్త ఐఫోన్లకు సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 18 నుంచి మార్కెట్లో అమ్మకాలు మొదలవుతాయి.

అమెరికాలో ఐఫోన్ 18 ప్రో 256GB మోడల్ ధర 1,199 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.06 లక్షలు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర 1,299 డాలర్లు.. అంటే సుమారు రూ.1.14 లక్షలు. మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించకుండా విడతలుగా చెల్లించేందుకు లీజింగ్ ఆప్షన్‌ను కూడా ఆపిల్ అందిస్తోంది.

Also Read : ఎంతకు తెగించార్రా.. రోడ్డుపైన గణేశుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లిపోయారు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.