Maruti Suzuki
Maruti Suzuki

Maruti Suzuki:  దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా రూ. 30,000 వరకు ఉండబోతోందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ పూర్తి వివరాలను వెల్లడించింది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

:ముడి పదార్థాల (Raw Materials) ధరల భారం పెరగడం.కార్ల తయారీ వ్యయం (Manufacturing Costs) భారీగా కావడం.మార్కెట్‌లో నెలకొన్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.”గడిచిన కొన్ని నెలలుగా అంతర్గత ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అనివార్య పరిస్థితుల్లో ప్రస్తుత భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కావడం లేదు. అందుకే వినియోగదారులపై సాధ్యమైనంత తక్కువ ప్రభావం పడేలా చూస్తూ, కొంత భారాన్ని బదిలీ చేయాల్సి వస్తోంది.” అని మారుతీ సుజుకీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మారుతీ సుజుకీ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ మోడల్ అయిన ఎస్‌-ప్రెస్సో (S-Presso) నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ అయిన ఇన్విక్టో (Invicto) వరకు వైవిధ్యభరితమైన కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు రూ. 3.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 28.7 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. గతేడాది జీఎస్టీ 2.0 (GST 2.0) నిర్ణయం కారణంగా కంపెనీ తన ఎంట్రీ లెవల్ కార్ల ధరలను భారీగా తగ్గించి కస్టమర్లకు ఊరటనిచ్చింది. అప్పట్లో తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

కార్ మోడల్    గతేడాది తగ్గిన ధర (రూపాయల్లో)

ఎస్‌-ప్రెస్సో (S-Presso)    రూ. 1.29 లక్షలు
ఆల్టో కే10 (Alto K10)    రూ. 1.07 లక్షలు
సెలిరియో (Celerio)    రూ. 94,000
వ్యాగనార్‌ (Wagon R)    రూ. 79,000

గతేడాది ప్రభుత్వ పన్నుల తగ్గింపుతో భారీగా తగ్గిన కార్ల ధరలు, తాజా పెంపు నిర్ణయంతో మళ్లీ పెరగనున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆల్టో, వ్యాగన్ ఆర్, సెలెరియో వంటి మోడళ్లపై కూడా ఈ ప్రభావం పడనుంది. కాబట్టి మారుతీ కారు కొనాలనుకునే వారు జూన్ లోపు నిర్ణయం తీసుకుంటే కొంతవరకు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.