
Anti Paper Leak Bill : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ బిల్లు (యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు) లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అలాగే లోక్ సభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. పేపర్ లీక్ మాఫియా లేదా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించనున్నారు. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించి బాధ్యులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన లేదా అక్రమాలకు సహకరించిన ప్రైవేట్ సర్వీస్ ఏజెన్సీలపై జరిమానాతో పాటు వాటిపై నిషేధ కాలం మరింత పెంచబడింది.
Also Read : అరుణాచలం మోక్షమార్గంలో కొత్త రూల్స్.. కచ్చితంగా పాటించాల్సిందే!
Also Read : పరారీకి ప్రయత్నించిన గ్యాంగ్ రేప్ నిందితులు.. కస్టడీలోనే ప్రజల దాడి









